ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఆ తరవాత… ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్టు సిద్ధమైంది. తుదిమెరుగులు దిద్దుతున్నారు. ‘సాహో’ పూర్తయిన వెంటనే.. రాధాకృష్ణ సినిమా మొదలవుతుంది. అందుకే ఓ వైపు స్ర్కిప్టు పనులు పూర్తి చేస్తూనే మరోవైపు టెక్నికల్ టీమ్‌ని కూడా రెడీగా ఉంచుకున్నాడు రాధాకృష్ణ. అయితే ఈలోగా టీమ్‌లో ఓ కీలకమైన మార్పు జరిగింది. కళా దర్శకుడు సాబూ సిరిల్ స్థానంలో రవీందర్ వచ్చి చేరాడు. సాహోకి సాబూనే కళా దర్శకుడు. రాధాకృష్ణ సినిమాకీ ఆయన్నే అనుకున్నారు. అయితే ఈలోగా ఆ స్థానం మారింది.
ప్రభాస్‌తో రవీందర్‌కి మంచి అనుబంధం ఉంది. ‘ఛత్రపతి’ చిత్రానికి రవీందర్ కళా దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన ‘మహానుభావుడు’, ‘భాగమతి’కీ ఆయనే సెట్స్వేశారు. మరీ ముఖ్యంగా ‘భాగమతి’లోని సెట్ రవీందర్ పనితనానికి నిదర్శనంగా నిలిచింది. కేవలం 28 రోజుల్లో సెట్ నిర్మాణం పూర్తి చేసి యూవీ క్రియేషన్స్‌కి అటు టైమ్, ఇటు డబ్బూ ఆదా చేశారు. అందుకే.. ప్రభాస్ తన తదుపరి సినిమాని కూడా.. రవీందర్ చేతిలో పెట్టినట్టు సమాచారం. రాధాకష్ణ కథలో సెట్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉందని తెలుస్తోంది. క్రియేటీవ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రవీందర్ అయితే… అనుకున్న బడ్జెట్లో, కావల్సిన సమయానికి సెట్స్ అందిస్తారన్న నమ్మకంతో… ఆయన్ని టీమ్‌లోకి తీసుకున్నారు.