ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలందర్నీ చట్టసభలకు రానివ్వకుండా చేశారు ఢిల్లీ ఓటర్లు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా వచ్చిన క్రేజ్ తో ఢిల్లీ లో తిరుగులేని నేతగా ఉన్న షీలాదీక్షిత్ను న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఓడించిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ పెద్దగా పేరులేని లీడర్ చేతిలో పరాజయం పాలయ్యారు. సీనియర్ బీజేపీ నేత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పర్వేశ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ పన్నెండు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అతిశీ అతి కష్టం మీద విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరీని హోరాహోరీగా పోరులో ఓడించారు. కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తే డిప్యూటీ సీఎం ఢిల్లీని పరిపాలించిన మనీష్ సిసోడియా కూడా పరాజయం పాలయ్యారు. జంగ్ పురాలో స్వల్ప ఓట్ల తేడాతో సిసోడియా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. సిసోడియా కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా కాలం జైల్లో ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అతిశీ ఢిల్లీ ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత పదవి చేపట్టలేదు. అయినా ఓడిపోయారు. మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన మరో నేత సత్యేందర్ జైన్ కూడా ఓడిపోయారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో పెత్తనం చేసిన పెద్దలంతా దాదాపుగా అంతా ఓడిపోయారు. ఇది ఆ పార్టీ కి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. స్వయంగా కేజ్రీవాల్ ఓడిపోవడం అంటే ప్రజల్లో ఆయన పలుకుబడి పూర్తిగా మందగించినట్లే అనుకోవచ్చు. తాను అవినీతి చేయలేదని నమ్మితే ఓటుతో మద్దతివ్వండి కేజ్రీవాల్ చేసిన ప్రచారం.. తేడా కొట్టింది. ఇప్పుడు ఆయన అవినీతి చేసినట్లుగా ప్రజలు నమ్మినట్లయింది.