ఏపీ సీఎం చంద్రబాబు విజన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగిస్తారు. కొంతమంది నేతలు ఓ దశాబ్ద కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధిని చేపడుతుంటారు. చంద్రబాబు మాత్రం ఇందుకు భిన్నం. ఆయన కొన్ని భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని విధానాలను రూపొందిస్తారు. అభివృద్ధిని డిజైన్ చేస్తారు. ఇది ఏ టీడీపీ లీడరూ, కార్యకర్తో, కూటమి నేతలో చెప్పింది కాదు.. 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగడియా చెప్పారు. చంద్రబాబును ప్రశంసించారు.
చంద్రబాబు విజన్ గురించి తనకు తెలుసు అని , ఆయన పాలనను ప్రశంసించారు.నీతి అయోగ్ లో ఇద్దరం కలిసి పని చేశామని , అప్పుడే బాబు విజన్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. మనం రేపటి గురించి ఆలోచిస్తాం… చంద్రబాబు మాత్రం వచ్చే కొన్నాళ్ల గురించి స్వప్నిస్తారు అని చెప్పుకొచ్చారు. ఆయన ఆలోచన విధానం తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు.
2047విజన్ కోసం తపిస్తున్న చంద్రబాబు స్వప్నం సాకారం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి చంద్రబాబు ఓ రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నారని , దాని ద్వారా ఆయన ముందుకు వెళ్తున్నారని అరవింద్ పనగడియా చెప్పారు.
ఏపీకి వచ్చిన కేంద్ర 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగడియా మాట్లాడుతూ చంద్రబాబును ప్రశంసించారు. చంద్రబాబుపై ప్రశంసలు సాధారణమే. అభివృద్ధి పట్ల ఆయన చూపించే కమిట్మెంట్ ఎంతోమందిని ఆకట్టుకుంటుంది . కానీ,ప్రపంచ ఆర్థికవేత్త నుంచి ప్రశంసలు రావడం.. చంద్రబాబుకు మరింత బూస్టింగ్ ఇచ్చేవే.