ఆర్యన్ ఖఆన్ క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంపై కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ప్రభాకర్ సెయిల్ కీలక సాక్షి . తన ప్రాణానికి అప్పటి ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే నుంచి ముప్పు ఉందని ఆరోపించారు. షారుఖ్ ఖాన్ కుమారుడైన ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో ఓ క్రూయిజ్లో పార్టీ చేసుకుంటూండగా సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు.
వారి వద్ద డ్రగ్స్ ఉన్నాయని .. డ్రగ్స్ సేవించారని కేసు నమోదు చేశారు. ఈ అరెస్ట్ సమయంలో ప్రదీప్ గోసవి అనే ప్రవేటు డిటెక్టివ్ కూడా ఎన్సీబీ బృందంలో ఉన్నారు.ఈ గోసవి బాడీగార్డే ప్రభాకర్ సెయిల్. ఆ డ్రగ్స్ కేసు అంతా కుట్ర పూరితం అని గోసవి..ఎన్సీబీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రభాకర్ అప్పట్లో మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో అతడి ప్రాణానికి వాంఖడే నుంచి హానీ ఉందని స్పష్టం చేశారు.
తాను చేసిన ఆరోపణలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ కేసులో గతేడాది అక్టోబర్ లో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్.. మూడు వారాల తర్వాత జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ప్రభాకర్ సెయిల్ మృతితో కేసులో అనేక అంశాలు చిక్కుముడిపడిపోయే అవకాశం కనిపిస్తోంది.