రోజంతా జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ వ్యవహారాన్ని పరిశీలిస్తే.. 2014కి ముందు… ఆంధ్రప్రేదశ్ ప్రజలను పార్లమెంట్ వేదికగా ఎంత దారుణంగా.. అవమానించి… దగా చేశారో.. నిన్న కూడా అదే తరహాలో చర్చ సాగింది. ఏ ఒక్క విషయంలోనూ ఆంధ్రప్రేదశ్కు క్లారిటీ దక్కలేదు. ఏ హామీలు అయితే ఇచ్చి విభజన చట్టాన్ని పాస్ చేయించుకున్నారో..అదే విభజన హామీలపై.. నాలుగేళ్ల తర్వాత కూడా… పార్లమెంట్లో చర్చ జరపాల్సి.. అమలు చేయాల్సిన దౌర్భగ్య పరిస్థితి వచ్చింది.అయినా వాటికి పరిష్కారం దొరకలేదు. అన్నీ మాటలే చెప్పి… రాజకీయం చేసేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా, ఉక్కు పరిశ్రమ, రైల్వోజోన్ సహా.. అటు గల్లా జయదేవ్.. ఇటు రామ్మోహన్ నాయుడు.. మోడీకి అర్థమయ్యే భాషలోనే చెప్పారు. ఆయన ఆయనకు ఇవన్నీ.. ఆంధ్రప్రదేశ్ అంతర్గత సమస్యలుగాకనే కనిపించాయి. ఏపీ సమస్యలను పార్లమెంట్ దాకా తెచ్చి రాజకీయం చేస్తున్నారని… చాలా తేలికగా విమర్శించేశారు. నాడు విభజనను..కాంగ్రెస్, బీజేపీ కలసి చేశాయనే సంగతిని మర్చిపోయారు. కాంగ్రెస్ ఒక్కదాని పాపం అన్నట్లు.. తామెంతో మంచి చేద్దామనకుంటున్నట్లు చెప్పారు.. కానీ ఎలా మంచి చేస్తారో చెప్పలేదు.
అవిశ్వాస తీర్మానం విషయంలో…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ప్రజలకు అర్థమయింది .. ఒక్కే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం.. రాష్ట్రాన్ని విభజించాయి. ఇప్పుడు అదే రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్లో ఆటలాడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజల స్థాయికి… దక్షిణాది రాష్ట్రాల జీవన ప్రమాణాలను దిగజార్చేందుకు… అలాంటి రాజకీయాల్లో ఇక్కడే చేయాలనుకుంటున్నారు. పార్లమెంట్ వేదికగా జరిగింది అదే. కట్టుబట్టలతో .. ఓ రాష్ట్రాన్ని నెత్తిన అప్పు పెట్టి గెంటేశారు. అన్నీ మేము చూసుకుంటామన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలను కూడా చూడాలని .. అడ్డగోలుగా మోసం చేశారు. ఏపీకి.. ఏపీ ప్రజలు పార్లమెంట్ వేదికగా మరో సారి దగా పడ్డారు..!