ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే దాన్ని మోసమంటారు అని జగన్ రెడ్డి తన పదవీ ప్రమాణం చేసిన ఆరు నెలల తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి వ్యాఖ్యానించారు. తన పాలన ఏదో… అక్కడే ఆగిపోతుదంని..తన పాలనకూ చివరి ఆరు నెలలు రావని… ఆ సమయంలో తాను శంకుస్థాపనలు ఏవీ చేయనని ఆయన అనుకున్నారో లేకపోతే… ఆ ప్పటి సంగతి అప్పుడు చూసుకుందామని రెచ్చిపోయారో కానీ.. ఇప్పుడు ఆ మాటలన్నీ ఆయనకే వస్తున్నాయి.
జగన్ రెడ్డి పాలన చివరికి వచ్చింది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ జగన్ రెడ్డి తాను కామెంట్స్ చేసి శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ కు మరోసారి శంకుస్థాపన చేశారు కానీ కట్టిందేమీ లేదు. కనీసం ప్రహరీగోడ కూడా కట్టుకోలేదు . భూములు మాత్రం కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పోలోమంటూ శంకుస్థాపనలకు బయలుదేరారు. గత ప్రభుత్వం మాచర్లలో పరికశలపూడి ప్రాజెక్టుకు పాలనామోదం ఇచ్చింది. రూ. నాలుగు వందల కోట్లను మంజూరు చేసింది. ఐదేళ్ల పాటు దాన్నిప క్కన పెట్టేసిన జగన్ రెడ్డి ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడానికి బయలుదేరాడు. ఉత్తుత్తి టెంకాయ కొట్టి ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అయ్యారు.
ఇక నుంచి జగన్ రెడ్డి చేసే ప్రతి శంకుస్థాపన పచ్చి మోసమే. ఆయన చెప్పిన దాని ప్రకారం ఎన్నికలకు ఆరు నెలలముందు నుంచే శంకుస్థాపనలు ఆపేయాలి. కానీ నాలుగు నెలల ముందు స్టార్ట్ చేస్తున్నాడు జగన్ రెడ్డి. ఈ ఐదేళ్లలో జీవనాడి అయిన పోలవరాన్ని పడుకోబెట్టేశాడు. శరవేగంగా పనులు జరుగుతున్న సమయంలో బినామీకి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు రివర్స్ టెండర్లేసి.. మొత్తానికి మోసం తెచ్చాడు. ఐదేళ్ల పాటు పోలవరం పనులు ఆగిపోయాయి. అదొక్కటే కాదు.. ఏపీలో ఒక్క ప్రాజెక్టుకూ నిధులుకేటాయించలేదు.. పూర్తి చేయలేదు. శంకుస్థాపనలకు బయలుదేరాడు. నమ్మేవాడుంటే… ఇదిగో రేపే కట్టేస్తానని చెప్పేస్తాడు జగన్ రెడ్డి., తనను నమ్మేవాళ్లంటే.. అంత అలుసు మరి !