ఓ మూవీ ఆడియో ఫంక్షన్ లో కామెడీ నటుడు ఆలీ చేసిన వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. ‘అనుష్క తొడలు’ అంటూ ఆలీ పెద్ద చర్చకు తెర లేపాడు. అనుష్క తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టమని చేసిన ఆలీ వ్యాఖ్యలపై మండిపడుతూ హైదరాబాద్ కు చెందిన ఆశ అనే ఓ యువతి ఫైరయింది. ఇలాంటి అసభ్యకర కామెంట్స్ చేస్త్తూ.. అవమానపరిస్తే మహిళ సంఘాలతో ఆలీ అంతు చూస్తామంటూ ఓ వీడియో చేసి నెట్ లో పెట్టింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=GSBcRnSgd9Q&edit=vd
టీవీ ప్రొగ్రామ్స్ ల్లో, సినిమా ఫంక్షన్లలో ఆడవాళ్లపై ఆలీ వల్గర్ కామెంట్స్ చేస్తున్నాడని, ఇటీవల మరింతా దిగజారుడు కామెంట్స్ చేస్తున్నాడని ఆ యువతి ఆలీపై మండిపడింది. ఆలీ చేస్తున్న ప్రొగ్రామ్స్ నేరుగా టీవీల్లోనే వస్తుండటంతో ఇంట్లో ఉండే పిల్లలు, తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ సంఘాలతో ఆలీ అంతు చూస్తామని ఆ యువతి హెచ్చరించింది.
ఇటీవల అన్నపూర్ణ సుంకర అనే యువతి కూడా ఆలీపై మండిపడిన విషయం తెలిసిందే. ‘ఆలీ మనిషా..దున్నపోతా..’ అంటూ ఘాటు పదజాలం వాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలీ తీరును తప్పుపడుతూ ఆశ అనే మరో యువతి చేసిన హెచ్చరికపై ఆలీ ఎలా స్పందిస్తాడో చూడాలి.