సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రకు కాస్త ప్రాధన్యత దొరికిందంటే.. అది నాగార్జున ‘నా సామిరంగ’లో ఆషికా రంగనాథ్ కే. గుంటూరు కారంలో శ్రీలీల మరీ రొటీన్ గా తేలిపోయింది. సైంధవ్ లో శ్రద్దా శ్రీనాథ్ కి తగిన పాత్ర లేదు. హనుమాన్ తో అమృత అయ్యర్ హిట్ అందుకుంది కానీ చెప్పుకోదగ్గ పాత్ర కాదది. చివరిగా వచ్చిన నా సామిరంగలో వరాలు గా కనిపించిన ఆషికా రంగనాథ్ మాత్రం అందం, అభినయంతో ఆకట్టుకుంది.
ఇందులో ఆషికా పాత్రకు నటించే అవకాశం కూడా దక్కింది. రెండు భిన్నమైన వేరియేషన్స్ లో కనిపించింది ఆషిక. రెండిట్లోనూ ఆకట్టుకుంది. నాగార్జునకు తగిన జోడి అనిపించింది. సీనియర్ హీరోల చిత్రాలకు హీరోయిన్ ఎంపిక అనేది ఎప్పుడూ ఒక కొరతే. ఆప్షన్స్ తక్కువున్నాయి. కొందరు క్రేజీ హీరోయిన్స్ వున్నారు. కానీ వాళ్లకి సీనియర్స్ తో జోడి అంతగా కుదరడం లేదు. ఇలాంటి సమయంలో ఆషికా ఇటు గ్లామర్, అటు నటన రెండితో ఆకర్షించి సీనియర్స్ కి సరిజోడి అనిపించుకుంటుందనే నమ్మకాన్ని ఇచ్చింది. మరి చూడాలి ఆమెకు ఎలాంటి ఆకాశాలు అందుతాయో.