‘హీరో’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఈ సినిమా ఆశించినంత విజయం అయితే ఇవ్వలేదు. అయితే మంచి కథ కోసం ఎదురుచూసి అశోక్ ఎట్టకేలకు ఇటివలే తన రెండో సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించారు.
అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చాలా సర్ ప్రైజ్ గా వుంది. రెండో సినిమాకి పూర్తిగా మేకోవార్ అయ్యాడు అశోక్. అసలు హీరో సినిమా చేసింది ఇతనేనా ? అనే అనుమానం కలిగేలా వుంది ఆయన లుక్కు. ఇప్పుడన్నీ మాస్ రస్టిక్ సినిమాలు నడుస్తున్నాయి. దానికి తగ్గేట్టే రెడీ అయ్యారని ఈ గ్లింప్స్ చూస్తే అర్ధమౌతుంది. పైగా ఈ సినిమా దర్శకుడు బోయపాటి దగ్గర శిష్యరికం చేశాడు. ఈ గ్లింప్స్ లో బోయపాటి మాస్ మార్క్ కూడా కనిపించిది.