టాలీవుడ్ కి మరో కొత్త హీరో వచ్చాడు. తనే గల్లా అశోక్. మహేష్ బాబుకి దగ్గర బంధువు. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా టైటిల్ తో పాటు, టీజర్ ని…. మహేష్ బాబు ఆవిష్కరించాడు. ఈ చిత్రానికి `హీరో` అనే పేరు ఖరారు చేశారు. కౌబోయ్ గెటప్ లో అశోక్ ని పరిచయం చేశాడు దర్శకుడు. కౌబోయ్ గా అశోక్ ఎపీరియన్స్.. ఆకట్టుకునే రేంజ్ లో ఉంది. ఆ షాట్స్ చూస్తుంటే… మహేష్ బాబు `టక్కరి దొంగ` గుర్తుకు రాక మానదు. అయితే ఇది కౌబోయ్ సినిమా కాదు. ఈ సినిమాలోని ఓ లుక్ మాత్రమే. ఈ టీజర్ లో ని షాట్స్చూస్తుంటే.. ఇందులో అశోక్ పాత్ర రకరకాల గెటప్పుల్లో ఉండబోతోందన్నది అర్థమవుతోంది. ముఖ్యంగా జోకర్ గెటప్ లో.. అశోక్ హావభావాలు ఆకట్టుకుంటాయి. తనలో మంచి నటుడున్నాడన్న విషయం అర్థమవుతుంది. జిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సమీర్ రెడ్డి పనితనం, దర్శకుడిగా.. శ్రీరామ్ ఆదిత్య మార్క్ అడుగడుగునా కనిపిస్తాయి.