అఖిల్ కెరీర్‌ని ఎలా గాడిలో పెట్టాలో నాగార్జునకి అర్థం కావడం లేదు. వరుసగా మూడో పరాజయం… నాగ్ని ఇబ్బందుల్లో నెట్టేసింది. తన సినిమాలు, తన కథలు వీటితోనే నాగ్‌కి సమయం సరిపోవడం లేదు. నిన్నా మొన్నటి వరకూ చైతూ టెన్షన్ ఒకటి ఉండేది. ఇప్పుడు చైతూ తన సినిమాల విషయంలో తానే నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగాడు. కాకపోతే.. అఖిల్ మాత్రం ఇంకా కుదురుకోలేదు. దాంతో నాగార్జున ప్రస్తుతం తన సినిమా విషయాలన్నీ పక్కన పెట్టి అఖిల్ గురించే ఆలోచిస్తున్నట్టు టాక్. ఇటీవల నాగ్ అశ్వనీదత్‌తో భేటీ అయ్యార్ట. `అఖిల్‌కి ఓ మంచి సినిమా చేసి పెట్టండి.. కథ, దర్శకుడు విషయంలో మీదే నిర్ణయం` అని తన బాధ్యత అశ్వనీదత్ పై పెట్టేశార్ట. అశ్వనీదత్ తనయురాళ్లు స్వప్న, ప్రియాంక కథల విషయంలో చాలా చురుగ్గా ఉంటున్నారు. స్వప్న అయితే రోజుకో కథ వింటుంది. అందులో మంచి కథలేమైనా ఉంటే.. అఖిల్‌కి షిఫ్ట్ చేస్తారిప్పుడు. మొత్తానికి అశ్వనీదత్ బ్యానర్లో అఖిల్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. కాకపోతే అఖిల్‌కి సరిపడా కథ దొరకాలంతే. అదెప్పుడు జరుగుతుందో..??