అశ్వినీదత్ నిర్మాణంలో వచ్చిన మహానటి సావిత్రి బయోపిక్ క్లాసిక్. దర్శకుడు, దత్ అల్లుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా మలచాడు. అయితే అలాంటి క్లాసిక్ అయ్యే మరో ఛాన్స్ వున్న బయోపిక్ అందాల తార శ్రీదేవిది. దీనిపై ఇదివరకూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నిర్మాత అశ్వినీదత్ మాత్రం మా అల్లుడు ఇక పై బయోపిక్స్ తీయడు అని ప్రకటించారు.
“శ్రీదేవి బయోపిక్ గురించి చాలా మంది అడుగుతున్నారు. మా ఆవిడ అయితే ‘నాగీ ఏంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోపిక్ తీయొచ్చు కదా’ అని అల్లుడిని రిక్వెస్ట్ చేసింది. నాగీకి ఇష్టం లేదు. ‘లేదు అత్తమ్మ.. ఇంక ఫ్యూచర్ లో బయోపిక్స్ తీయను. నా కెరీర్లో ఒక్కటే బయోపిక్. అదీ సావిత్రిగారిది. నాకు ఇష్టమైన నటి ఆమె. ఆమె సినిమాలు చూస్తూ పెరిగా… ఆమె అంటే అభిమానం నాకు. ఆ అభిమానం ఇంక ఎవరీపై రాదు. లేని ఎమోషన్ ని కల్పించుకొని చేయడం కష్టం’ అని నాగీ చాలా స్పష్టంగా చెప్పాడు. సో.. నాగీ నుండి ఇంక బయోపిక్స్ వుండవు” అని వెల్లడించారు అశ్వనీ దత్.