ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 సినిమా టీమ్ కు ఏషియన్ సునీల్ భారీ పార్టీ ఇచ్చారు. నైజాం ఏస్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత అయిన ఏషియన్ సునీల్ బుధవారం రాత్రి తన స్వంత పబ్ లో ఎఫ్ 2 టీమ్ కు భారీ పార్టీ ఇచ్చారు. హీరోయిన్లు మెహరీన్, తమన్నా మినహా మిగిలిన టీమ్ అంతా ఈ పార్టీకి హాజరయ్యారు.
నిర్మాత దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు హాజరయ్యారు. అయితే లోకల్ గా అందుబాటులో లేకపోవడంతో హీరోలు ఇద్దరూ మాత్రం రాలేదు.
సునీల్ కు సన్నిహితులు అయిన నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, మరో నిర్మాత అభిషేక్ నామా కూడా పార్టీకి వచ్చారు. దాదాపు తెల్లవారు ఝాము వరకు పార్టీ కొనసాగడం విశేషం. సాధారణంగా ఏషియన్ సునీల్-దిల్ రాజు కు వ్యాపార వైరుధ్యాలు వున్నాయని అంతా అనుకుంటారు. కానీ వాళ్ల మద్య సన్నిహిత సంబంధాలు వున్నాయని టాక్ వుంది. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ల మధ్య మంచి సంబంధాలు వున్నాయని రుజువు చేసింది