జాతీయ రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని తాను తెలంగాణ రాజకీయాల్లో ఎంతో సంతోషంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో కేసీఆర్ ఆరోగ్యంపై ఆడిగిన వారు కూడా వారు. కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుందని ఆయన రోజూ తమకు రాజకీయ సలహాలు ఇస్తున్నారని తెలిపారు. అమరావతి హైదరాబాద్‌కు పోటీ అవదని.. బెంగళూరను కూడా హైదరాబాద్ దాటిపోయిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందోనని సందేహం వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ నేతలతో వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయని … విధానాల పరంగానే వారితో వ్యతిరేకిస్తామని చెప్పారు.
కేటీఆర్ అత్యధికంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల ప్రశ్నలకే సమాధానం ఇచ్చారు. ఎక్కువ మంది కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తే దానికి అవును నిజమేనని కేటీఆర్ చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము పోరాడతామన్నారు. సోషల్ మీడియాను బలోపేతం చేయాలని వారితో సమావేశాలు పెట్టాలని కొంత మంది కార్యకర్తలు కోరారు. యూత్, మహిళా కమిటీలను ఏర్పాటు చేయాలని కొంత మందిని కోరారు. త్వరలోనే చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఘటనలపైనా స్పందించారు. అయితే అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే అన్నట్లుగా సాగిపోయాయి.
కొన్ని సరదా ప్రశ్నలకూ సమాధానాలు ఇచ్చారు. ఇటీవలి కాలంలో విజయ్ సేతుపతి నటించిన మహరాజా సినిమా తనకు నచ్చిందన్నారు. తనకుమారుడు బిజినెస్‌లో అండర్ గ్రాడ్యూయేషన్ చదువుతున్నారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విజయ్‌కు బెస్ట్ విషెష్ చెప్పారు. గంటన్నర సేపు కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.