ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి.. మిత్రుడు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేస్తానంటూ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్… చాలా సార్లు చెప్పారు. ఆయన హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీకి వస్తారో రారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే.. తెలంగాణ ఎన్నికలు కూడా మొదటి ఫేజ్‌లోనే ఉన్నాయి. ఆయన నియోజకవర్గాన్ని వదిలేసి.. ఏపీ లో జగన్ కోసం.. ప్రచారానికి రావడం కష్టమే. అందుకే గతంలో.. ఆయన చెప్పిన డైలాగులన్నీ తుస్మనిపిస్తున్నాయి. అదే సమయంలో.. చంద్రబాబునాయుడు… ముస్లింలను ఆకట్టుకోవడానికి …జగన్మోహన్ రెడ్డి కంటే.. పెద్ద ఎత్తే వేశారు. నేరుగా… ఫరూక్ అబ్దుల్లాను రంగంలోకి దింపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు.. చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఫరూక్ అబ్దుల్లాను.. ఏపీలో ప్రచారానికి చంద్రబాబు అంగీకరించారు. దానికి ఆయన కూడా అంగీకరించారు. నేడు కర్నూలులో చంద్రబాబుతో కలిసి.. ఫరూక్ అబ్దుల్లా ప్రచారం చేయబోతున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో.. చంద్రబాబు ఫరూక్ అబ్దుల్లా ప్రచారాన్ని ఉపయోగిచుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారన్న ఆగ్రహం ముస్లిం వర్గాల్లో కనిపిస్తోంది. వైసీపీకి ఓటు వేస్తే.. చివరికి ఆయన మోడీకే మద్దతిస్తాన్న భయం… వారిలో కనిపిస్తోంది. ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో… బీజేపీతో.. టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో.. ముస్లింలందరూ ఏకపక్షంగా వైసీపీకే ఓటు వేశారు. ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీకి లభించిన విజయాలే ఈ విషయం నిరూపించాయి.
అయితే.. ఈ సారి బీజేపీకి దగ్గరడవంతో.. వారి ఓటింగ్.. జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో.. వారిని తన వైపునకు ఆకర్షించుకునేందుకు.. టీడీపీ అధినేత.. చాలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మోడీపై పోరాడుతోంది.. తానేనన్న నమ్మకాన్ని కల్పించడమే కాదు.. ఫరూక్ అబ్దుల్లా లాంటి..జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేతల్ని తీసుకొచ్చి ప్రచారం చేయబోతున్నారు. అదే సమయంలో.. మైనార్టీల హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తారని పేరున్న మమతా బెనర్జీని కూడా.. ఏపీకి చంద్రబాబు ఆహ్వానించబోతున్నారు. ఓ రకంగా.. ముస్లిం ఓట్లను పొందడంతో.. చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.