నీకు పోలీస్ ఉంది.. నాకు పోలీస్ ఉంది అనే డైలాగ్ గతంలో చంద్రబాబు ఉపయోగించారు. అప్పట్లో ఏపీకి సంబంధించిన అంశాలపై తెలంగాణలో కేసులు పెడుతూంటే అలా అన్నారు . ఇప్పుడు అలా అనకపోయినా అసోం సీఎం చేతల్లో చూపిస్తున్నారు. నీకేనా పోలీస్ ఉంది మాకు లేరా అంటూ కేసీఆర్కు సంకేతాలు పంపారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై జుబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకున్న పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం దేశవ్యాప్త సంచలనం అయింది.
వెంటనే అసోం పోలీసులు కూడా ఓ ఫిర్యాదును తీసుకుని కేసీఆర్పై కేసు నమోదు చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్ కు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం పోలీసులకు బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారని.. సైనికులను కించపరిచే విధంగా, దేశ వ్యతిరేక భావాలు ప్రోత్సహించేలా మాట్లాడారని ఫిర్యాదు అందినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేయాలని పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.
అయితే తెలంగాణలో కేసు నమోదైన అంశంపై స్పష్టత వస్తేనే అక్కడి పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. నిజంగా తెలంగాణ పోలీసులు అసోం సీఎంపై కేసు నమోదు చేసి ఉంటే.. అక్కడ కూడా నమోదవుతుంది. అంటే ఇక్కడి సీఎంపై అక్కడ…స అక్కడి సీఎంపై ఇక్కడ కేసులు నమోదవుతాయి. అయినా అధికారలో ఉండే రాజకీయ పార్టీల నేతలు పోలీసులు తమకే ఉంటారని ఎందుకు అనుకుంటారో కానీ ఇలాంటి వివాదాలు మాత్రం తరచూ తెరపైకి వస్తూ ఉంటాయి.