శాసనమండలి చైర్మన్ సీరియస్ అయ్యారు. తన ఆదేశాలను లెక్క చేయకుండా.. మళ్లీ ఫైలును తన వద్దకే పంపడంపై.. శాసనమండలి కార్యదర్శిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫైల్‌ను మళ్లీ పంపి.. వెంటనే… సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి.. తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో రాజధాని బిల్లుల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం శాసనమండలి చైర్మన్ అధికారాలనే ప్రశ్నిస్తోంది. ఆయనకు.. ఎలాంటి అధికారాలు ఉండవన్నట్లుగా ప్రవర్తిస్తోంది. అధికారులందరూ ప్రభుత్వం గుప్పిట్లో ఉండటంతో… శాసనమండలి చైర్మన్ ఆదేశాలను అమలు చేయడానికి… మండలి కార్యదర్శి జంకుతున్నారు. ఆయనకు ఎలాంటి అధికారం లేకపోయినా.. మండలి చైర్మన ఆదేశాలను ధిక్కరిస్తూ.. ఫైలును ఆయనకే పంపారు.
ఈ వ్యవహారం.. కలకలం రేపుతోంది. రేపు.. స్పీకర్ ఆదేశాలను .. అసెంబ్లీ కార్యదర్శి పాటించబోమని వెనక్కి పంపితే.. వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మండలి కార్యదర్శి… ధిక్కరిస్తున్నారని.. ఆయనపై … మండలి ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం శాసనమండలికి ఉందని.. నిబంధనలు చెబుతున్నాయి. అయితే శిక్షలు అమలు చేయాల్సింది కూడా ప్రభుత్వమే కాబట్టి… ఆ విషయంలో కార్యదర్శికి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సెలక్ కమిటీ సభ్యుల్ని చైర్మన్ షరీఫ్ నియమించరు. ఆ పేర్లతో ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత మాత్రం కార్యదర్శిపై ఉంది.
ఆయన ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేదు. అయితే.. రాజ్యాంగ విరుద్ధమని.. వైసీపీ ఎమ్మెల్సీలు రాసిన లేఖలతో చైర్మన్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఫలితంగా.. వివాదం పీట ముడి పడుతోంది. ఇప్పుడు శాసనమండలి కార్యదర్శి.. చిక్కుల్లో పడ్డారు. అటు మండలి కార్యదర్శి ఆదేశాలు అమలు చేస్తే ప్రభుత్వానికి కోపం వస్తుంది. అమలు చేయకపోతే.. మండలి ధక్కరణ కింద తాను ఇరుక్కుపోతారు. ఇది మండలి ఉద్యోగుల్లో కలకలకానికి కారణం అవుతోంది.