సీఎం జగన్‌కు ఎప్పుడు ఏం అనిపిస్తుందో స్పీకర్‌కు కూడా తెలియదు. ముందుగా ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిసైడయిపోయి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడు కనీసం పదిహేను రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే సీఎం జగన్ గ్రేట్ అచ్చెన్న అడిగారు కాబట్టి పొడిగించాల్సిందేనని 26వ తేదీ వరకూ నిర్వహించేందుకు రెడీ అన్నారు. దీంతో ఒక్క రోజు నుంచి పొడిగింపు లభించిది. మధ్యలో సెలవులు ఉండటంతో మొత్తంగా ఆరు రోజులు అసెంబ్లీ జరిగే చాన్స్ ఉంది.
కుప్పం ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు మొహం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నానని.. ఆయనను అసెంబ్లీకి వచ్చేలా చూడాలని జగన్ బీఏసీ సమావేశంలో అచ్చెన్నతో వ్యాఖ్యానించారు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని…వస్తారని బీఏసీలో ఎన్నికల ప్రస్తావన ఎందుకని అచ్చెన్న ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. గెలుపోటములు సర్వసాధారణమన్నారు. అయితే కుప్పం, నెల్లూరు గురించి చర్చించాల్సిందిచాలా ఉందని.. జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. చర్చించాల్సిన ప్రజాసమస్యలు చాలా ఉన్నాయని అచ్చెన్న బదులిచ్చినట్లుగా చెబుతున్నారు.
అసెంబ్లీ మావేశాలను పొడిగించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం శాసనమండలిలో ఉన్న వైసీపీ నేతలకు తెలియలేదు . దీంతో వారు ఒక్క రోజే సమావేశం నిర్వహించాలని నిర్ణయించి.. బీఏసీ భేటీ పూర్తి చేసేశారు. కానీ తర్వాత సీఎం జగన్ 26వ రకు అసెంబ్లీ నిర్వహిస్తారని తెలిసిన తర్వాత మళ్లీ బీఏసీ భేటీ నిర్వహించాలని డిసైడయ్యారు. ఈ గందరగోళం అధికారవర్గాల్లోనూ ఏర్పడింది.