హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను తుళ్ళూరులో జరపటానికి ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశం ఆమోదం తెలిపింది. డిసెంబల్ 15 నుంచి ఐదు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షత వహించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, కౌన్సిల్ ఛైర్మన్ చక్రపాణి, వైసీపీ తరపున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , తెలుగుదేశం తరపున కాల్వ శ్రీనివాసులు తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశాలకోసం తుళ్ళూరులో తాత్కాలిక భవనాన్నియుద్ధప్రాతిపదికన నిర్మించనున్నారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలోనే ఈ భవనాన్ని ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. శాసన మండలి సమావేశాలుకూడా ఈ భవనంలోనే నిర్వహిస్తారు. రాజధాని శంకుస్థాపన పూర్తయ్యాక 40 రోజుల్లో తాత్కాలిక అసెంబ్లీ, శాసన మండలిని తుళ్ళూరులో ఏర్పాటు చేస్తామని స్పీకర్ కోడెల చెప్పారు.