ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పంపిణీ పథకాన్ని దాదాపుగా పూర్తి చేసింది. కొండ కోనల్లోనో… మరు మూల ప్రాంతాల్లోనో ఎక్కడైనా సరే ..గతంలో దళితులు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ అయినా తీసుకుని మరీ… పేదలకు ఒక్కో సెంట్ చొప్పున పంపిణీ పత్రాలు ఇచ్చేసింది. అక్కడ ఇళ్లుకట్టాల్సిన టాస్క్ మిగిలి ఉంది. ఇప్పుడు మధ్యతరగతి వారికి ఇంటి యోగం కల్పించడానికి ఏపీ సర్కార్ సిద్ధమయింది. లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏర్పాట్లు అంటే.. భూసేకరణ అన్నమాట. ఒక్కో పట్టణంలో వంద నుంచి నూట యాభై ఎకరాలు సేకరించాలని దిశానిర్దేశం చేశారు.
ఇప్పటికే పేదలకు ఇళ్లివ్వడానికి చేసిన భూసేకరణ అనేకానేక ఆరోపణలకు కారణం అయింది. కొన్ని వేల మంది అసైన్డ్ రైతుల కడుపు కొట్టింది. ఇప్పుడు పట్టణాల్లో భూసేకరణ ఎలా అనేది ప్రభుత్వ అధికారుల ముందు ఉన్న అతి పెద్ద సవాల్. ఎందుకంటే.. పట్టణాల్లో భూసేకరణ అంటే మామూలు విషయం కాదు. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం తడిసిమోపెడవుతుంది. అంటే… తక్కువలో భూసేకరణ జరగాలంటే… అసైన్డ్ ల్యాండ్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దశాబ్దాల క్రితం… ఊరి శివార్లు అని..చాలా మంది అసైన్డ్ ల్యాండ్స్ కేటాయించారు. ఇప్పుడు అవి ఊరి దగ్గరకు వచ్చి ఉంటాయి. వాటిని తీసుకుని డెలవప్ మెంట్ చేసి… ఆ అసైన్డ్ ల్యాండ్ ఓనర్లకు కొంత ఇచ్చి.. మిగతా మొత్తం మధ్యతరగతి వారికి విక్రయిస్తే ప్రభుత్వానికి కూడా డబ్బులు మిగులుతాయన్న అంచనాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అసలే ఇప్పుడు…అసైన్డ్ ల్యాండ్స్‌పై వివాదాలు జరుగుతున్నాయి. చంద్రబాబుపై కేసు పెట్టడానికి అదే అసైన్డ్ ల్యాండ్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సమయంలో అదే ఫార్ములా ప్రయోగించి.. పట్టణాల్లో భూసేకరణ చేస్తారా అన్నది కూడా సందేహమే. మొత్తానికి ఇప్పుడు పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలివ్వాలంటే పెద్ద ఎత్తున భూములు ససమీకరించారు. చట్ట ప్రకారం..పరిహారం ఇచ్చి పరిహారం తీసుకుంటే సమస్య ఉండదు కానీ… అధికారంతో బెదిరించి.. అసైన్డ్ ల్యాండ్స్ తీసుకుంటే మాత్రం… దళితులు తిరగబడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.