పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ భారీగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు నిర్మాత అశ్వనీదత్. హాలీవుడ్ అవెంజర్స్ స్థాయిలో ప్రాజెక్ట్ కె వుండబోతుందని, ఈ సినిమాతో చైనా అమెరికా మార్కెట్ ని టార్గెట్ చేస్తామని చెప్పారు.
”ప్రాజెక్ట్ కె ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతుంది. ప్రభాస్, దీపికా పదుకొనే సెట్స్ లోకి రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ కి షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. తొమ్మిది నెలలు గ్రాఫిక్స్ కోసం కేటాయించాం. హాలీవుడ్ అవెంజర్స్ స్థాయిలో ప్రాజెక్ట్ కె వుంటుంది. ఈ సినిమాతో చైనా, అమెరికా మార్కెట్ ని టార్గెట్ చేస్తాం. 2024 అక్టోబర్ లో సినిమాని విడుదల చేస్తాం” వెల్లడించారు అశ్వనీ దత్.