మాజీ మంత్రి, బీసీ నాయకుడు అచ్చెన్నాయుడును కేసు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే … అదీ ఆపరేషన్ జరిగిందని చెప్పినా.. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడు.. ఏసీబీ దర్యాప్తు అధికారి అయిన జేడీ రవికుమార్ ప్రెస్‌మీట్ పూర్తి అధారాలు ఉన్నాయనే అరెస్ట్ చేశామని ప్రకటించారు. రెండున్నర నెలల తర్వాత హైకోర్టు … అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా …. చిన్న ఆధారం కూడా చూపించలేకపోయారని వ్యాఖ్యానిస్తూ… ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మధ్య కాలంలో ఆయనకు బెయిల్ రాకుండా ఉండటానికి ఏసీబీ చాలా చెప్పింది. ఎన్ని చెప్పినా.. చివరికి.. కనీస ఆధారాలు కూడా సమర్పించలేదన్న విషయం హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.
అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనేదానికి తమ దగ్గర సాక్ష్యాలున్నాయని.. వందల కోట్లు చేతులు మారాయన్నట్లుగా.. వేల కోట్ల స్కాం అని.. ఏసీబీ అధికారులు రాజకీయ నాయకుల మాదిరిగా ప్రకటనలు చేశారు. మీడియా ముందు అదే పనిగా ప్రకటనలు చేసి.. మెయిన్‌స్ట్రీం మీడియా.. సోషల్ మీడియాల్లో అచ్చెన్నాయుడుపై అనేక రకాల ప్రచారాలు జరగడానికి కారకులయ్యారు. కానీ ఇప్పుడు తీరా.. కోర్టుకు సాక్ష్యాలు సమర్పించే సమయానికి ఒక్కంటే.. ఒక్క ఆధారం కూడా.. చూపించలేకపోతున్నారు. అచ్చెన్నాయుడు మూడు లేఖలు మాత్రమే రాశారని.. చెబుతున్నారు. ఆ లేఖలు రాయడం ఎలా అవినీతో చెప్పాలంటే మాత్రం నీళ్లు నములుతున్నారు. అచ్చెన్నాయుడు బెయిల్ రాకుండా ఉండే ఉద్దేశంతోనే మూడో నిందితుడిగా ఉన్న ప్రమోద్ రెడ్డిని అరెస్ట్ చేయడం లేదనే ఆరోపణలు ఏసీబీ అధికారులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అది కోర్టు దృష్టిలో అసమర్థతగా పడిపోయింది.
అవినీతి అంటే… ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన వ్యక్తి లబ్ది పొంది ఉండాలి. అలా లబ్ది పొందారని సాక్ష్యాలు ఉన్నప్పుడే కేసులు పెడతారు. ఆరెస్టులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయనను రాత్రికి రాత్రే అరెస్ట్ చేయలేదు. సీబీఐ అన్ని ఆధారాలను సేకరించింది. మనీ ట్రాన్సాక్షన్స్‌ను.. గుర్తించింది. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే అరెస్ట్ చేసింది. కానీ అచ్చెన్న విషయంలో ఒక్క రూపాయి అచ్చెన్నాయుడు లబ్ది పొందినట్లుగా ఏసీబీ చెప్పడం లేదు. అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమీ తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు… ఈ వ్యవహారం మొత్తం ఏసీబీ అధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే… అసెంబ్లీ ప్రారంభానికి రెండు రోజుల ముందు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారనే ఆరోపణలు బలంగా వచ్చాయి. ఇప్పుడు అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డట్లుగా అధారాలు చూపించకపోతే…. దర్యాప్తు అధికారులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడం ఖాయమని చెబుతున్నారు.