ఓ నోటీసు లేదు..! అప్పటి వరకూ కేసు పెట్టారని కూడా తెలియదు..! ఏం అభియోగాలు మోపారో కూడా తెలియదు..! ఓ సారి పిలిచి.. ఇదిగో మీపై ఇలాంటి అభియోగాలు ఉన్నాయి.. మీ వివరణ ఏమిటి అని అడిగిన పాపాన పోలేదు..! అచ్చెన్నాయుడు పారిపోయే వ్యక్తి కాదు…! ఆయనపై ఎలాంటి వయోలెంట్ ట్రాక్ రికార్డు కూడా లేదు..! అంతకు మించి ఆయనకు ముందు రోజే సర్జరీ జరిగింది…! .. ఇలాంటి పరిస్థితుల్లో… వందల మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి.. గోడలు దూకి.. తలుపులు బద్దలు కొట్టి.. ఇంట్లోకి వెళ్లి తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి..?. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.
పైల్స్ ఆపరేషన్ చేశారని తెలిసినా 16 గంటలు ప్రయాణం చేయించిన పోలీసులు..!
అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటి గోడ దూకి.. తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన సమయంలో… అచ్చెన్నాయుడు భార్య…. ఆపరేషన్ పత్రాలు చూపించారు. అంతకు ముందు రోజే ఆపరేషన్ జరిగిందని.. మందులు వేసుకోవాల్సి ఉందని చెప్పినా బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఆమె మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. పైల్స్ సమస్యతో బాధపడుతున్న ఆయన… కనీసం ఓ అరగంట కూర్చోవడం కష్టం అవుతుంది. అలాంటిది ఆయనను ఉదయం.. ఏడు గంటలకు అరెస్ట్ చేస్తే.. తెల్లవారుజామున.. ఆస్పత్రికి తరలించే వరకూ కారులో తిప్పుతూనే ఉన్నారు. మధ్యలో ఓ మూడు గంటలు మాత్రం.. వివిధ కార్యాలయ్యాల్లో ఉంచారు. అంటే.. ఆపరేషన్ జరిగిన వ్యక్తిని.. కూర్చోలేని వ్యక్తిని అత్యంత దారుణంగా హింసించిట్లేననన్న ఆభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆపరేషన్ విషయం తమకు దారి మధ్యలో తెలిసిందని ఏసీబీ పోలీసుల కొత్త మాట..!
అయితే.. ఏసీబీ అధికారులు మాత్రం. ఆయనకు ఆపరేషన్ జరిగిన విషయం తమకు దారిలోనే తెలిసిందని కొత్త మాట చెప్పారు. అచ్చెన్నాయుడుదారి మధ్యలో భారీగా బ్లీడింగ్ అయింది. ఆయనను తుని దగ్గర ఓ తోటకు తీసుకెళ్లారని అచ్చెన్నాయుడును ఫాలో అయిన వారు చెప్పారు. అక్కడ ఆపరేషన్ గాయానికి డ్రెస్సింగ్ చేసి.. మళ్లీ కారులో తిప్పారు. అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆపరేషన్ పత్రాలు చూపించినప్పటికీ.. తమకు దారిలోనే తెలిసిందని ఏసీబీ అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే వారి ఇంటెన్షన్ ఏమిటో స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు.
నోటీసులు ఇవ్వకుండా.. విచారణ చేయకుండా అరెస్ట్ చట్టబద్ధమేనా..?
నోటీసులు ఇవ్వకుండా.. ప్రశ్నించకుండా.. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందనేదానికి.. ఏసీబీ అధికారులు చిత్రమైన సమాధానం చెబుతున్నారు. పూర్తి అధారాలున్నాయని అరెస్ట్ చేయలేదన్నారు. ఆ ఆధారాలు ఏమిటంటే.. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు మూడు కోట్ల రూపాయలు చెల్లించడమే. ఆ టెలీ హెల్త్ సర్వీసెస్ సేవలు వినియోగించుకోవాలని లేఖ రాయడమే. కోర్టులో ఏం జరుగుతుందో కానీ… ఏసీబీ అధికారులు మాత్రం ఆయనకు ముందుగానే శిక్ష విధించేశారన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది.