విమానాశ్రయాలు మూసేశారు. రైల్వే స్టేషన్లు మూసేశారు. బస్ స్టేషన్లు మూసేశారు. అంతర్జాతీయ సరిహద్దులే కాదు.. రాష్ట్రాల సరిహద్దులు జిల్లాల సరిహద్దులు కూడా మూసేశారు. ఎవరైనా సరే… అటూ ఇటూ వెళ్లాలంటే పధ్నాలుగు రోజుల క్వారంటైన్ తప్పని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల సంగతేమో కానీ.. ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం..ఈ గంభీరమైన ప్రకటనలు చేసింది. చేయడమే కాదు.. పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ఏపీ ప్రజల్ని సరిహద్దు వద్ద నిలిపివేసి వెనక్కి పంపేసింది. కాదు .. ఏపీలోకే వస్తామనుకున్న వారికిని క్వారంటైన్‌కు తరలించింది. చాలా స్ట్రిక్ట్‌గా నిబంధనలు అమలు చేస్తున్నారేమోనని అందరూ అనుకుంటారు. కానీ.. వైసీపీ వాళ్లకు.. ప్రభుత్వం కావాలనుకున్న వారు మాత్రం.. సులువుగా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు.
విరాళాలివ్వడానికి హైదరాబాద్ నుంచి రోజూ పది మందికిపైగా ఏపీకి వస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రినే కలుస్తున్నారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు నుంచి.. నేరుగా.. ఎస్ఈసీగా పదవి చేపట్టడానికి కనగరాజ్ వచ్చేశారు. చెన్నై నుంచి ఆయన హుటాహుటిన ఏపీ చేరుకోవడమే కాదు.. పదవి కూడా చేపట్టేశారు. ఈ పరిస్థితులపై టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి కనగరాజ్ తమిళనాడు నుంచి ఏపీకి ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సరిహద్దులో వేలాది మంది ఏపీ వాళ్లు.. క్వారంటైన్‌కు వెళ్తామంటేనే రానిస్తామన్న మీరు ఇప్పుడేం చెబుతారని అచ్చెన్నాయును సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు.
సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తున్న చంద్రబాబును హైదరాబాద్ నుంచి రమ్మంటున్నారని.. పాలన చేతకాదని ఒప్పుకోండి..చంద్రబాబు వచ్చి పాలనంటే ఏంటో చూపిస్తారని మండిపడ్డారు. మంత్రులు వ్యక్తిగత పనులు మీద.. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లి విపక్షాలను విమర్శించే ప్రెస్మీట్లు పెడుతున్నారు. ఇలాంటి తీరు వల్ల సామాన్యుల్లోనూ.. లాక్ డౌన్ పై సీరియస్ నెస్ పోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు ఉపాధి లేకుండా చేసి.. వారంతా.. స్వేచ్చగా తిరుగుతున్నారనే విమర్శలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి.
సీఎం గారూ, అత్యధిక కరోనా కేసులున్న తమిళనాడు నుంచి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి జస్టిస్ కనగరాజ్ ఏపీకి ఎలా వచ్చారు? తెలంగాణ బోర్డర్లో వేలాదిమంది ఏపీవాళ్లు క్వారంటైన్‌కి వెళ్తామంటేనే రానిస్తామన్న మీరు దీనికేమి సమాధానం చెబుతారు?
— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 11, 2020