అచ్చెన్నాయుడుని ఉదయం ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్ట్ చేసిన తర్వాత పన్నెండు గంటల పాటు కార్లలో తిప్పి.. విజయవాడ ఏసీబీ కోర్టుకు తెల్లవారుజామున తీసుకెళ్లారు., ఇలా ప్రయాణం చేయించడం వల్ల ఆయనకు ఆపరేషన్ అయిన గాయం పెద్దది అయిందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. అంతకు ముందు రోజే.. అచ్చెన్నకు సర్జరీ జరిగిందని.. ఆయనకు ఐదు రోజుల విశ్రాంతి అవసరమని.. కానీ పోలీసులు తీసుకు రావడం.. అదే పనిగా ప్రయాణం చేయడం గాయం పెద్దదయిందని డాక్టర్లు తెలిపారు. ఇంకా గాయం పెద్దది అయితే.. మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు.
తొంభై శాతం అలాంటి పరిస్థితి రాకపోవచ్చని.. కానీ ఇప్పుడే చెప్పడం కుదరదన్నారు. ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు… పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని.. డాక్టర్లు తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడుకు కనీసం.. ఒక్క సారంటే ఒక్క సారి కూడా నోటీసులు ఇవ్వకుండా.. రెండు, మూడు వందల మంది పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి.. ఇల్లు దూకి.. ఆయన ఎక్కడికో పారిపోతారన్నట్లుగా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు.
ఆయనకు సర్జరీ జరిగిందని కుటుంబసభ్యులు పత్రాలు చూపించినా పోలీసులు పట్టించుకోలేదు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీమించినట్లుగా తెలుస్తోంది. ప్రయాణంలో ఓ సారి ఆపరేషన్ ప్రాంతం నుంచి రక్తం కారడంతో.. ఓ సారి డ్రెస్సింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన గాయం.. అంతకంతకూ పెద్దదయ్యేలా చేసి పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరించిందని ఆయన కుటుంబసభ్యులు మండి పడుతున్నారు.