ఈవారం విడుదలైన సినిమాల్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు మంచి స్పందన వచ్చింది. వసూళ్లూ బాగున్నాయి. అయితే ఈ సినిమా నాని ‘గ్యాంగ్ లీడర్’ని కాస్త ఇబ్బందుల్లోకి నెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ రెండు సినిమాల్లోని కొన్ని సన్నివేశాలకు పోలిక ఉందట. నాని ‘గ్యాంగ్ లీడర్’ కూడా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లా ఇన్వెస్టిగేషన్ మోడ్‌లో సాగే సినిమా అని తెలుస్తోంది. కథలో మలుపులు చాలా ఉంటాయట. అలాంటి కొన్ని మలుపులు, ఎపిసోడ్స్ ‘ఏజెంట్..’లో తగిలాయి. దాంతో ‘గ్యాంగ్ లీడర్’ ఇబ్బందుల్లో పడినట్టు సమాచారం. సాధారణంగా విక్రమ్ కె.కుమార్‌పై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. `ఏజెంట్..` కథకీ `గ్యాంగ్ లీడర్`కీ లింకులు ఉన్నాయంటే ఈ రెండు సినిమాలకూ మూలం ఎక్కడో హాలీవుడ్లో ఉండే ఉంటుంది. అందుకే సీన్లలో కొన్ని పోలికలు వచ్చాయేమో. `గ్యాంగ్ లీడర్` వచ్చాక ఏజెంట్‌తో పోల్చి ఈ సినిమాని మాట్లాడుకునే ఛాన్సుందని, అలా జరక్కుండా ఉండాలంటే `గ్యాంగ్ లీడర్`లో కొన్ని మార్పులు అనివార్యం అని నాని, విక్రమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.