జగన్ తల్లి విజయమ్మ, చెల్లెళ్లు షర్మిల,సునీతలపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త వర్రా రవీందరారెడ్డిపై తాజాగా మరో కేసు నమోదు అయింది. అయనపై నందలూరు పోలీస్ స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదు అయింది. వర్రాతో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపైనా కేసులు నమోదయ్యాయి. వర్రాను అరెస్టు చేయడంతో మిగిలిన వారి కోసం గాలింపులు ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా అవినాష్ రెడ్డి బయటకు రావడం లేదు. వర్రాను పరామర్శించేదుకు ఆయనకు న్యాయ సాయం చేసేందుకు ఏర్పాట్లు చేయలేదు.
మరో వైపు తనపై .. తన కుటుంబంపై దారుణమైన ఆరోపణలు, బూతులు మాట్లాడుతూ పోస్టులు పెట్టిన వారి పై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత మరోసారి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళో రేపో ఆమె పులివెందుల వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఆమె ఫిర్యాదుపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పోస్టుల వెనుక జగన్ రెడ్డి ఉన్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజం కాకూడదని వర్రాకు ఎలాంటి సపోర్టు ఇవ్వట్లేదు. దీంతో ఆయన కుటుంబం… మోసం చేశారని అనుకుంటోంది.
మరో వైపు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఆయన ఎక్కడున్నాడో తెలియడం లేదు. అవినాష్ రెడ్డి ఆయనకు షెల్టర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. రాఘవరెడ్డిని పోలీసులు పట్టుకుంటే అవినాష్ రెడ్డే ఈ మొత్తం పోస్టుల వెనుక ఉన్నారన్నదానికి పెద్ద సాక్ష్యం లభిస్తుంది., వెంటనే అవినాష్ రెడ్డిపై కూడా కేసు నమోదవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ రెడ్డి ఎవర్నీ సమర్థించలేరు. ఎందుకంటే వారు కేసుల పాలవుతోంది విజయమ్మ, షర్మిల ,సునీతలపై తప్పుడు పోస్టులు పెట్టినందుకు. అలా పెట్టిన వారికి సపోర్టుగా జగన్ మాట్లాడితే ఆయన నైజంపై ప్రజల్లో మళ్లీ చర్చ జరుగుతుంది. సొంత తల్లి, చెల్లిపై అలాంటి ఆరోపణలు చేయిస్తారా అని అందరూ ఆశ్చర్యపోతారు.
ఇప్పుడు అవినాష్ రెడ్డి బయటకు వచ్చి వర్రాకు సపోర్టు పలికితే.. ఆయనే పెట్టించారన్న క్లారిటీ వస్తుంది. అలా చెప్పేందుకు అవినాష్ రెడ్డి సిద్ధంగా లేరు. మొత్తంగా కేసు అవినాష్ రెడ్డి దగ్గరకే చేరుతోంది.