బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఎయిర్ పోర్స్ వింగ్ కమాండ్ ఆదిత్యబోస్, ఆయన భార్య స్క్వాడ్రన్ లీడర్ అయిన మధుమితపై కొంత మంది దాడి చేశారు. కన్నడ మాట్లాడేవాళ్లు వారిపై దాడి చేశారు. కోల్ కతా వెళ్లేందుకు ఫ్లైట్ కోసం వారు ఎయిర్ పోర్టుకు వెళ్తున్నారు. మధ్యలో ఈ దాడి జరిగింది. తీవ్రమైన గాయాలతో వింగ్ కమాండర్ సోషల్ మీడియాలో వీడియో పెట్టడంతో వైరల్ అయింది. పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.
అయితే కన్నడ మాట్లాడలేనందు వల్ల ఈ దాడి జరిగిందని ప్రచారం చేస్తున్నారు. అయితే కన్నడ మాట్లాడేవాళ్లు తనపై దాడి చేశారని.. ఆయన చెప్పాడు కానీ తాను కన్నడ మాట్లాడలేదని దాడి చేయలేదని చెప్పలేదు. ట్రాఫిక్ ఇష్యూ కారణంగా బైక్ పై వెళ్తున్న కుర్రవాళ్ల జరిగిన గొడవలో వింగ్ కమాండ్ పై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నాయి. అయితే ఆయన వింగ్ కమాండర్ కావడం.. ఆయన భార్య కూడా స్క్వాడ్రన్ లీడర్ కావడంతో విషయం జాతీయ స్థాయికి వెళ్లింది.
ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. హిందీ మాట్లాడితేనే బెంగళూరులో ఉండాలని ఓ అపార్టుమెంట్లో వ్యక్తితో గొడవపడ్డాడు. ఆ వీడియో వైరల్ అయింది. నిజానికి ఇలాంటి భాషా సమస్యలను ఉద్దేశపూర్వకంగా సృష్టించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరులో ఉండాలంటే కన్నడ నేర్చుకోవాల్సిందేనని కొంత మంది అప్పుడప్పుడూ నినాదాలు చేస్తూ ఉంటారు. ఈ వ్యవహారం మెల్లగా హింసాత్మక ఘటనలకు దారి తీస్తే బెంగళూరు గ్లోబల్ సిటీ ఇమేజే దెబ్బతింటుంది.