పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ అడుగు పెట్టకూడదన్నట్లుగా చెలరేగిపోయారు. అభ్యర్థిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే స్టేషన్ పైనా దాడి చేశారు. మొత్తంగా ప దకొండు వాహనాలు తగులబెట్టారు. ఇంత ఘోరమైన పరిస్థితులు పుంగనూరు నియోజకవర్గంలో ఉంటే ఎన్నికల సంఘం ఏమైనా స్పందించిందా ?.
పుంగనూరులో పెద్దిరెడ్డి అరాచకం గురించి చెప్పాల్సిన పని లేదు. అలాంటి చోట్ల.. ఆయన నియమించుకున్న అధికారుల్ని తీసేసి నిజాయితీ కలిగిన అధికారుల్ని నియమించి ఉంటే ఈ ప రిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు అక్కడ స్వేచ్చగా ఎన్నికలు జరుగుతాయని ఎవరైనా అనుకుంటారా ?. ఒక్క పుంగనూరు కాదు.. పల్నాడు సహా అనేక ప్రాంతాల్లో దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. కానీ పోలీసులకు చీమ కుట్టినట్లుగా ఉండటం లేదు. ఎన్నిల సంఘం పట్టించుకోవడం లేదు.
ఎన్నికలు సంఘం పూర్తి స్థాయిలో నింపాదిగా ఉంది. ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఏదో ఎవరో ఒకర్ని బదిలీ చేస్తున్నామన్నట్లుగా ఉన్నారు కానీ..అసలు వ్యవస్థల్ని నడిపించేవారు నిజాయితీగా లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. భారత ప్రజాస్వామ్యానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలే రక్ష. అలా నిర్వహించడానికి అవసరమైన అన్ని అధికారాల్ని ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఏపీలో ఏం జరుగుతోంది ?