వేరే రాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేసి వచ్చి తమ గ్రామంలో సేఫ్ గా ఉండటం బీహార్ లాంటి రాష్ట్రాల్లో దొంగలు చేస్తూంటారు. అన్నీ తెలుసుకుని ఎవరైనా పట్టుకోవడానికి వెళ్తే… వారిపై మూకుమ్మడి దాడి చేస్తారు. గ్రామాల దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి కల్పిస్తారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కడప జిల్లా మైదుకూరులో సమీపంలో చిన్నయ్యగారి పల్లిలో దొంగల్ని పట్టుకోవడానికి వెళ్లిన తెలంగాణ పోలీసులపై నిందితులంతా కలిసి దాడి చేశారు. పోలీసువాహనాన్ని ధ్వంసం చేశారు.
మైదకూరు దగ్గర చిన్నయ్యగారి పల్లె గ్రామానికి చెందిన కొంతమంది ఇటీవల నల్లగొండజిల్లా చెన్నంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రెలను కొంటామని బేరం ఆడారు. కొన్నారు. కానీ డబ్బులివ్వలేదు. ఇస్తామని నమ్మబలికి తీసుకెళ్లిపోయారు. మోసం చేయడంతో వారు కేసు పెట్టారు. వారికి సమన్లు ఇచ్చేందుకు చెన్నంపేట ఎస్ఐ తన సిబ్బందితో కడప జిల్లా వెళ్లారు. చిన్నయ్యగారి పల్లెకు రాత్రికి చేరుకున్నారు. అక్కడజ నిందితుల్ని గుర్తించారు. కానీ వారు .. పోలీసులతో వాగ్వదానికి దిగి దాడి చేశారు.
ఎస్ఐతో పాటు సిబ్బంది.. డ్రైవర్ ను చితకబాదారు. కారు కూడ ధ్వంసం అయింది. మైదుకూరు పోలీసులు ఏమీ తెలియనట్లు ఉండిపోయారు. అంతా అయిపోయిన తర్వాత అవునా.. అని ఆశ్చర్యపోయి కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్టు చేశారా అనే డౌట్ పెట్టుకోవద్దు.. అలాంటివి జరగవు. గతంలో గంజాయి పట్టుకోవడానికి వచ్చిన వారిపైనా దాడులు జరిగాయి .. అయినా పట్టించుకున్న వారు లేరు. ఏపీలో వ్యవస్థలు ఇలాగే ఉంటాయి….మరి !