తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు, హత్యలు ఆగడం లేదు. కొన్ని రాజకీయాలకు సంబంధం లేనివి.. వ్యక్తిగత కక్షలు ఉన్నా.. మరికొన్ని రాజకీయ ప్రేరేపితం ఉంటున్నాయి. ఇలాంటి దాడులు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అనే యువనాయకుడి హత్య అత్యంత ఘోరం. సాధారణంగా విపక్ష పార్టీ నేతలపై వ్యక్తిగత, రాజకీయ కక్షలు పెంచుకుంటే అధికారంలో ఉన్నవాళ్లు దాడులు చేయవచ్చు.కానీ అధికారంలో ఉన్న వారిపై విపక్ష పార్టీలకు చెందిన వారు దాడి చేయాలంటే ఎంతో దైర్యం చేయాలి.
ఎలాంటి పనులు చేసినా చట్ట పరంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని అనే ధైర్యం ఉంటే ఇలాంటి దాడులు చేస్తారు. పుంగనూరు నుంచి పలు చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అవి క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి కారణంగా నేరాలు చేయాలనుకునే.. ముఖ్యంగా టీడీపీ నేతలపై దాడులు చేయాలనుకునే వైసీపీ నేతలు,కార్యకర్తల్లో భయం పోవడమే. ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తుందేమో అని భయపడే పరిస్థితి పోతోంది. మహా అయితే పట్టుకుని జైలుకు పంపుతారు.. ఓ రెండు, మూడు నెలలు జైలులో ఉండి బయటకు రావచ్చు..తర్వాత చేసిన నేరం పక్కకుపోతుంది అనుకుంటున్నారు. ఇలాంటి అభిప్రాయం స్వయంగా ఐపీఎస్ సీతారామాంజనేయులుకే ఉంది. ఇక కింది స్థాయి వారికి ఉండదా ?
వారు చేసింది హత్య. ఏం చేసినా ప్రాణం తిరిగి రాదు. వారిని చట్ట ప్రకారం శిక్షించడానికి అయితే వారికి భయం ఉండదు. కానీ ప్రభుత్వం తల్చుకుంటే అంతకు మించి చేయవచ్చు. చట్ట పరిధిలోనే చేయాలనుకున్నది చేయవచ్చు. అలా చేస్తేనే టీడీపీ క్యాడర్ కు కాస్త భరోసా వస్తుంది. రాజకీయాలతోనే కక్షలు ఏర్పడకపోవచ్చు. రాజకీయాల వల్ల వ్యక్తిగత కక్షలు వస్తాయి. రాజకీయాల వల్లనే వివాదాలు వస్తాయి. అందుకే.. టీడీపీ క్యాడర్ కు భరోసా ఇవ్వాలంటే ఇప్పటి వరకూ దాడులుక పాల్పడిన వారికి శిక్ష పడాలి. అది ఎలాంటిదంటే.. మరోసారి టీడీపీ నేతల మీద దాడి చేయాలంటే.. భయపడిపోవాలి. అప్పుడే టీడీపీ కార్యకర్తలపై దాడులు ఆగడానికి అవకాశం ఉంటుంది.
జగన్ రెడ్డి పార్టీకి సంబంధం లేని ఓ హత్య వినుకొండలో జరిగితే ఆ హతుడ్ని తన పార్టీకి పురమాయించేసుకుని ఎంత రచ్చ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు టీడీపీ నేరుగా వైసీపీ నేతలు చేసిన హత్యలకు చేతలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.