ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఢిల్లీ ీజేపీ నేతలు ప్రధానంగా ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు మెల్లగా సీన్ మారుతోంది. ఈడీ సోదాల తర్వాత ఈ స్కాంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అరబిందోనే. “అరబిందో ఫార్మా లిక్కర్ కార్టెల్” హ్యాష్ ట్యాగ్‌తో బీజేపీతో పాటు ఇతరులు పెద్ద ఎత్తున ఈ స్కాం గురించిన వివరాలు బయట పెడుతున్నారు. బినామీ కంపెనీల పేరుతో అరబిందో ఫార్మా ఉత్పత్తి చేయడం.. హోల్ సేల్‌గా అమ్మడం.. రీటైల్‌గా అమ్మడం అన్నీ చేసిందని వివరాలు బయట పెడుతున్నారు.
దీనికి సంబంధించిన కంపెనీల వివరాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అరబిందో ఫార్మా విజయసాయిరెడ్డి వియ్యంకుడిది. ఈ సంస్థ ఇప్పటి వరకూ మద్యం వ్యాపారంలో ఉందని ఎవరికీ తెలియదు. మందులు మాత్రమే తయారు చేస్తుందని అనుకున్నారు. కానీ మద్యం తయారీ.. హోల్ సేల్, అమ్మకాల రంగంలోకి కూడా అడుగుపెట్టిందని ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడిన తర్వాత స్పష్టత వచ్చింది. ఈ కేసులో ముందు ముందు జరగబోయే పరిణామాలు అరబిందో చుట్టే తిరగబోతున్నాయన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది.
ఇప్పటికే ఈ అంశం చుట్టూ ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఈ కేసులో ఉన్నది విజయసాయిరెడ్డి అల్లుడేనని నేరుగా చెప్పారు. టీడీపీ నేతలు అసలు లిక్కర్ స్కాం సూత్రధారి వైఎస్ భారతి అని ఆరోపిస్తున్నారు. అనుకున్నంత తేలికగా లేదని.. ఇది చాలా పెద్ద స్కామని.. లోతుగా విచారిస్తే ఏపీ లిక్కర్ పాలసీ గురించి కూడా మొత్తం బయటకు వస్తుందన్న వాదన వినిపిస్తోంది.