టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా పోరు ముగిసింది. సోమవారం భారత్ చేతిలో చిత్తయినప్పుడే సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. అయితే బంగ్లాదేశ్ చేతిలో ఆఘ్గన్ ఓడిపోతే గనుక.. ఆసీస్‌కు ఛాన్స్ ఉండేది. కానీ.. ఆ అవకాశం కూడా లేకుండా బంగ్లాపై ఆఫ్గానిస్థాన్ అనూహ్య విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఈరోజు గ్రూప్ 8లో భాగంగా జరిగిన కీలకమైన పోరులో బంగ్లా – ఆఫ్గాన్ జట్టు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరాలంటే 12.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించాలి. కానీ.. 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో ఆస్ట్రేలియా ఇంటికి ఆఫ్గానిస్థాన్ సెమీస్‌కూ చేరుకొన్నాయి. బ్యాటింగ్ లో విఫలమైన ఆఫ్గనిస్థాన్ బౌలింగ్‌లో కలసికట్టుగా రాణించింది. కెప్టెన్ రషిద్ ఖాన్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాశించాడు.
గ్రూప్ ఏలో భారత్ ఇప్పటికే సెమీస్ లో చోటు సంపాదించుకొంది. గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రియా, ఇంగ్లండ్ సెమీస్ బెర్తులు ఖాయం చేసుకొన్నాయి. సెమీస్‌లో ఆఫ్గన్ సౌత్ ఆఫ్రికాతోనూ, ఇండియా ఇంగ్లండ్ తోనూ తలపడనున్నాయి.