మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ఆడియో లీకుల బెడత వెంటాడుతూనే ఉంది. గతంలో మంత్రిగా ఓ మహిళను అరగంట వచ్చిపో అని ఆయన అడిగిన సంభాషణ వైరల్ అయింది. అది తన వాయిస్ కాదని ఆయన గట్టిగా ఖండించలేపోయారు. తాజాగా సోషల్ మీడియాలో మరో ఆడియో టేపు వైరల్ అవుతోంది. ఐ లవ్యూ బంగారం అంటూ ఆయన మాట్లాడిన మాటలు… అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఆయన వయసేంటి.. ఇంత లేటు వయసులో ఈ ప్రేమేంటి అని సెటైర్లు వేస్తున్నారు.
అవంతి శ్రీనివాస్ .. గతంలో తన ఆడియో.. తనది కాదని చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆ విషయాన్ని రూఢీ చేయాలనే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం కూడా తమ మంత్రిపై అంత సీరియస్ ఆరోపణలు వచ్చినా లైట్ తీసుకుంది. విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందని.. లైట్ తీసుకున్నారని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి ఆడియోనే బయటకు వచ్చింది. సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ అవుతున్నా.. ఇంత వరకూ అవంతి శ్రీనివాస్ స్పందించలేదు. కాస్త తేరుకున్న తర్వాత.. ఆ ఆడియో తనది కాదని చెప్పే అవకాశం ఉంది.
అవంతి శ్రీనివాస్.. విద్యావేత్త. ఆయనకుచాలా కాలేజీలు ఉన్నాయి. అలాంటి విద్యా వేత్త ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. కానీ ఆయన బుద్ది అలాంటిదేనని ఆయనతో పాటు ఉండి బయటకు వచ్చినవారు చెబుతున్నారు. ఆయన బలహీనతను అడ్డం పెట్టుకుని.. ఇతర మహిళలు కూడా ఆడియోలు రికార్డు చేసి బయటకు వదిలి.. ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా అవంతి సరస సంభాషణల్లో రెండో ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్