నటుడిగా కంటే రచయితగా, దర్శకుడిగా ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు అవసరాల శ్రీనివాస్. దర్శకత్వం పై మోజుతోనే తనకొచ్చిన అవకాశాల్ని కూడా వదులుకుంటున్నాడు. ఇప్పుడు నాగశౌర్యతో ఓ లవ్ స్టోరీ తీస్తున్నాడు అవసరాల. ఇదో వెరైటీ ప్రేమ కథ. నాగశౌర్య పాత్రలో ఏడు షేడ్స్ ఉంటాయట. ఇప్పి వరకూ ఈ తరహా సినిమా రాలేదని నాగశౌర్య ధీమాగా చెబుతున్నాడు. ”ఇప్పటి వరకూ చాలా లవ్ స్టోరీలు చేశాను.కానీ అవసరాల శ్రీనివాస్ తో చేస్తున్న కథ మాత్రం చాలా వెరైటీగా ఉండబోతోంది. నా పాత్రలోనే ఏడు షేడ్స్ ఉంటాయి. మరో పదేళ్ల తరవాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా ఉంటుంది” అని చెబుతున్నాడు. అవసరాల – నాగశౌర్యది మంచి కాంబినేషనే. ‘ఊహలు గుసగుసలాడే’ మంచి హిట్టయ్యింది. ‘జ్యో అత్యుతానంద’ కూడా బాగానే ఆడింది. సో.. ఇది హ్యాట్రిక్ సినిమా అన్నమాట.