ఊహలు గుసగుసలాడేతో దర్శకుడిగా మారాడు అవసరాల శ్రీనివాస్. ఆ సినిమాతో మంచి మార్కులే తెచ్చుకొన్నాడు. జ్యో అచ్చుతానందతో దర్శకుడిగా తన రేంజు పెరిగింది. ఈ సినిమా ఇప్పుడు లాభాల బాట పట్టింది. టేకింగ్ పరంగా అవసరాలకు చక్కటి గుర్తింపు దక్కింది. మరో త్రివిక్రమ్ అంటూ పొగిడేస్తున్నారు కూడా. అవసరాల తదుపరి సినిమాకు మరింత డిమాండ్ ఉంటుందన్నది నిస్సందేహం. నానితో అవసరాల ఓ సినిమా చేయబోతున్నాడు. 2017లో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఆ సినిమాకిగానూ రూ.2.5 కోట్ల పారితోషికంగా అందుకొంటున్నాడని సమాచారం. మరింతకీ.. జ్యో అచ్యుతానంద సినిమాకి ఎంతిచ్చారు?? తొలి సినిమా పారితోషికం ఎంత??
ఊహలు గుసగుసలాడే టైమ్లో అవసరాల శ్రీనివాస్ నెల జీతం లెక్కన పని చేసినట్టు సమాచారం. మొత్తం పోగేస్తే రూ.15 లక్షలు కూడా ముట్టలేదట. రెండో సినిమాకి మాత్రం రూ.60 లక్షలు అందాయని తెలుస్తోంది. వారాహీ బ్యానర్లో వరుసగా మూడు సినిమాలు చేయాల్సిందే అంటూ అగ్రిమెంట్ ఏమీ లేదని కేవలం అవసరాల శ్రీనివాస్ – సాయికొర్రపాటిల మధ్య ఉన్న సరస్పర అవగాహనతోనే వరుసగా వారాహీ బ్యానర్లో సినిమాలు చేస్తున్నాడని తెలుస్తోంది. నాని సినిమాకి రూ.2.5 కోట్ల పారితోషికం అనేది అవసరాల అడిగిందేం కాదట. సాయి కొర్రపాటి డిసైడ్ చేసిన ఎమౌంట్ అదని తెలుస్తోంది. ”ఈలోగా నీకు మంచి ఆఫర్ వస్తే.. దీనికంటే మంచి పారితోషికం ఇస్తే.. ఆ నిర్మాతతో సినిమా చేసుకో..” అని సాయికొర్రపాటి ఆఫర్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అదీ.. అవసరాల రెమ్యునరేషన్ లెక్కల కథ.