సెకీ – అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ ను రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెరపైకి తెస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు, పీవీ రమేష్ ఈ అంశంపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతుందని.. లంచాలు తీసుకుని ఈ ఒప్పందాలు చేసుకున్నందున రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు.
అమెరికాలో లంచాల వ్యవహారం వెలుగు చూసినప్పుడు ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. నేరుగా జగన్ కు లంచం ఇచ్చినట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. సెకీ-అదానీతో ఒప్పందం రద్దు చేసుకుంటే పెట్టుబడుల పై ప్రభావం చూపుతుందని..కానీ అందులో అవినీతి జరిగి ఉంటే ఊరుకునేది లేదని మాత్రం ప్రకటించారు.
అమెరికాలో ట్రంప్ రావడంతో అక్కడ కేసు సైలెంట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ కూడా పట్టించుకోవడం లేదు . వామపక్షాలు మాత్రం గుర్తున్నప్పుడల్లా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు రిటైర్డ్ అధికారులను తెరపైకి తెచ్చారు. నిజానికి వీరిద్దరూ టీడీపీ పెద్దలతో సన్నిహితంగా ఉండేవారే. గతంలో పీవీ రమేష్ జగన్ క్యాంపులో ఉన్నప్పటికీ తర్వాత బయటకు వచ్చేశారు. కానీ సెకి-అదానీ విద్యుత్ ఒప్పందం రద్దు కోసం వారు రంగంలోకి దిగుతున్నారు.