ఎట్టి పరిస్థితుల్లోనూ సీబీఐ విచారణకు హాజరు కాకూడదనే పట్టుదలతో అవినాష్ రెడ్డి ఉన్నారు. తన తల్లి అనారోగ్యంతో ఉన్నందున ఆమెను డిశ్చార్జ్ చేసే వరకూ విచారణకు రానని ఆయన సీబీఐకి లేక రాశారు. సోమవారం రావాలని ఇంతకు ముందే సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐ విచారణకు వెళ్లాల్సిన ఆయన తన తల్లికి అనారోగ్యం పేరుతో డుమ్మా కొట్టారు. ఆమెకు సీరియస్ గా ఉందని చెప్పి అటు హైదరాబాద్ కు కానీ.. ఇటు బెంగళూరుకు కానీ తీసుకెళ్లకుండా మధ్యలో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడి వైద్యుడు, అవినాష్ రెడ్డి స్నేహితుడు ఆమె పరిస్థితి కొంత ఆందోళన కరంగా ఉందని ప్రకటించారు. ఎన్ని రోజులు చికిత్స చేయాలో చెప్పలేదు కానీ.. ఆయన మాటల్ని బట్టి చూస్తే మరికొన్ని వారాల పాటు అయినా సరే ఆస్పత్రిలో ఉంచడానికి రెడీ అయినట్లుగా ఉంది. సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడానికి చాలా పకడ్బందీగా అవినాష్ రెడ్డి గేమ్ ఆడుతున్నారని చిన్న పిల్లవాడికైనా అర్థం అవుతుంది. ఇప్పుడు సీబీఐ ఏం చేస్తుందనేది కీలకంగా మారింది.
అసలు విచారణకు సహకకరించపోగా .. లేనిపోని సాకులు చెప్పి..తప్పించుకుంటూడటంతో. .ఈ కేసు విషయంలో అందరి అనుమానాలు నిజమేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎన్నో క్లిష్టమైన కేసులను చూసిన సీబీఐకి ఇలాంటి పిల్ల చేష్టలు చేసే నిందితులు ఎదురుపడటం ఇదే తొలి సారి కావొచ్చు. ఇప్పుడు వారిని ఎలా సీబీఐ డీల్ చేస్తుందనేది కీలకం.