వైఎస్ అవినాష్ రెడ్డి నిర్వాకం మరోసారి సుప్రీంకోర్టులో పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ సాక్షిగా మరోసారి బయటపడింది. సీబీఐ అధికారుల్ని బెదిరించడానికి ఆయన చేసిన తప్పుడు కేసుల వ్యూహం బట్టబయలు అయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ అఫిడవిట్ పై స్పందించే తీరు ఎంత సీరియస్ గా ఉంటుందో.. వివేకా హత్య కేసు అంత గట్టిగా అవినాష్ చుట్టూ బిగుసుకుంటుంది.
వివేకా పీఏతో అవినాష్ రెడ్డి ఆట
సీబీఐ అధికారులు తనను కొట్టి.. హింసించి అవినాష్ రెడ్డికి ఇతరులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ రాయించుకున్నారని వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు వివేకా కుమార్తె, అల్లుడిపైనా కేసులు పెట్టారు. అప్పట్లో సీబీఐకి ఎదురైన ఆటంకాల గురించి చెప్పాల్సిన పనిలేదు. జగన్ సీఎంగా ఉండగా.. సీబీఐని దర్యాప్తు చేయనివ్వలేదు. పైగా కేసులు పెట్టి నియంత్రించారు. ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి.
హత్య కేసులో వివేకా కుమార్తె, అల్లుడిని ఇరికించే కుట్ర
అవినాష్ రెడ్డి సాక్ష్యాలను మాయం చేయడమే కాదు.. వివేకా కుమార్తె సునీత రాక ముందే అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పోలీస్ కేసు, పోస్టుమార్టం ఏమీ లేకుండా చేయాలని చూశారు. కానీ వివేకా కుమార్తె పట్టుబట్టడంతో దొరికిపోవాల్సి వచ్చింది. చివరికి వివేకా కుమార్తె తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాల్సిందేనని పోరాటం చేస్తూండటంతో వారి మీదే నెపం నెట్టేందుకు ప్లాన్ చేశారు. అప్పటి పోలీసు అధికారులు కొంత మంది ఈ కుట్రలో భాగమయ్యారు కూడా. గుండెపోటు అని ప్రచారం చేసి.. సాక్ష్యాలను మాయం చేసి.. గొడ్డలి పోట్లకు కట్లు కట్టి అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఆయనను కుమార్తె హత్య చేయించిందని కేసు పెట్టేలా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చిన్న విషయం కాదు.
సీబీఐతో గేమ్స్ ఎంత ప్రమాదకరమో తెలుస్తుందా ?
సీబీఐతో గేమ్స్ ఎంత ప్రమాదకరమో..మెల్లగా తెలుస్తుంది. ఎల్లకాలం అధికారంలో ఉంటారని అనుకున్నారేమో కానీ… హత్యలు చేసినా తప్పించుకోవచ్చని.. ఇతరుల్ని బలి చేయవచ్చని అనుకున్నారు. అందుకే సీబీఐతోనూ ఆడుకున్నారు. ఈ కేసు ఇప్పుడు సీబీఐకి ఇజ్జత్ కా సవాల్ లాంటిది. దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. కేసు దర్యాప్తు అధికారిపై అధికారంలో ఉన్న వారి ప్రోద్భలంతో ఎదురు కేసు పెట్టడం అంటే.. ఏ మాత్రం చిన్న విషయం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ విషయాన్ని అవినాష్ రెడ్డి అండ్ కో కుతెలిసేలా చేస్తుందనడంలో సందేహం లేదు. వివేకా హత్య కేసులో సంచలన పరిణామాలు ముందు ముందు చోటు చేసుకోనున్నాయి.
చీప్ ట్రిక్స్‌తో దొరికిపోవడం అవినాష్ రెడ్డి స్టైల్
వివేకాను హత్య చేసినప్పటి నుంచి పరిణామాలు చూస్తే..ఓ సినిమాలో దొంగతనం చేసి ఇట్టే దొరికిపోయే బ్రహ్మానందం పాత్ర గుర్తుకు వస్తుంది. గొడ్డలితో నరికి చంపి గుండెపోటు అని చెప్పాలనే ఐడియా నుంచి.. పోట్లకు కట్లు కట్టడం … పోస్టుమార్టం కూడా వద్దని చెప్పడం… తాను అరెస్టు కాకుండా సీబీఐనే ఆపడం.. చివరికి ఆ హత్య కేసును వివేకా కుమార్తె మీద నెట్టడానికి తప్పుడు కేసు పెట్టించడం వంటివి ఇలాంటి కోవలోనే వస్తాయి. కాస్త తెలివి ఉన్న వాడెవడైనా ఇలా ఎలా.. అని ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అదే జరుగుతోంది.