వైఎస్ జగన్ బాబాయ్ వివేకా హత్య కేసు… అవినాష్ రెడ్డి చుట్టూనే తిరుగుతోందని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని ప్రశ్నించకపోయినా… మొత్తం వ్యవహారంలో మొదటి నుంచి అవినాష్ రెడ్డి మాత్రమే.. ప్రతీ ఘటనలోనూ కనిపిస్తున్నారు. మొట్టమొదటగా… వివేకా మృతదేహాన్ని చూసింది అవినాష్ రెడ్డినే. విషయం దాచి పెట్టి… సహజమరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి కూడా అవినాష్ రెడ్డినే. ఎవరైనా.. అలాంటి పరిస్థితుల్లో ఓ మనిషి చనిపోతే.. ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తారు. కానీ అవినాష్ రెడ్డి.. సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా తెలిసిపోయింది. వివేకా కు తగలిగిన దెబ్బలు కనబడకుండా కట్టు కట్టారు. బట్టలు మార్చారు. బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేశారు. దాంతో.. పోలీసులు సాక్ష్యాలు మాయం చేశారని ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు.
హత్య విషయాన్ని ఎందుకు దాచి పెట్టారు..? సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించాలనుకున్నారు..? పోస్టుమార్టం ఎందుకు వద్దనన్నారు..? కేసులు కూడా అవసరం లేదని ఎందుకన్నారు..? ఇలాంటి అనుమానాలపై పోలీసులు ఇప్పటికే ప్రాథమిక సమాచారం… సేకరించారు. అంత్యక్రియల హడావుడిలో ఉండటంతో.. అవినాష్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించలేదు. కానీ ఈ అనుమానాలన్నింటిపై ప్రశ్నించడానికి ప్రాథమిక సమాచారం అంతా సేకరించారు. వివేకా మృతదేహాన్ని చూసిన తర్వాత అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారు..? ఏమేం మాట్లాడారు..? వివేకా మృతదేహాన్ని ఎవరెవరు వచ్చి చూసి పోయారు..? అలాంటి అంశాలపై సమాచారం సేకరించారు. డ్రైవర్‌పై నేరాన్ని మోపేందుకు ప్రయత్నించారన్న విషయంకూడా లేఖతో స్పష్టమయిందని పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ ప్రసాద్, పనిమనిషి లక్ష్మి, ఆమె కుమారుడు, పీఏ కృష్ణారెడ్డిలను పోలీసులు విడివిడిగా ప్రశ్నించారు. వీరందరి దగ్గర్నుంచి.. వచ్చిన సమాధానాల్లో.. కామన్‌గా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అవినాష్ రెడ్డి అని ప్రచారం జరుగుతోంది.
సున్నితమైన ఇష్యూ.. రాజకీయం చేస్తూండటంతో.. పోలీసులు పక్కా ఆధారాలతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే.. కేసు చిక్కుముడి దాదాపుగా వీడిపోయిందని… కొన్ని సాంకేతిక అంశాలపై ఆధారాలు సేకరించిన తర్వాత అసలు నిందితుల్ని అరెస్ట్ చేస్తామని.., పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏ విధంగా చూసినా.. అవినాష్ రెడ్డి చుట్టూనే… వివేకా మర్డర్ మిస్టరీ ఉండిపోయిందన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. దీనిపై వారం రోజుల్లో మొత్తం కుట్ర కోణం వెల్లడవనుందని పోలీసులు చెబుతున్నారు.