సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి గందరగోళపడి జగన్, భారతిల్ని ఇరికించేశారన్న అనుమానాలను పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్యూలో పాల్గొన్న బీటెక్ రవి వివేకానందరెడ్డి హత్య కేసు గురించి చాలా డీటైల్ గా మాట్లాడారు. అందులో అవినాష్ రెడ్డి తాను సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ల విషయంలో పడిన కంగారును కూడా విశ్లేషించారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు రెండు సార్లు వెళ్లిన తర్వాత తన స్టేట్మెంట్ ఆడియో , వీడియోలు రికార్డులు చేయడం లేదని.. తన సంతకాలు తీసుకున్నారు కానీ మ్యానిపులేట్ చేశారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లారని బీటెక్ రవి గుర్తు చేశారు
తర్వాత కూడా తన స్టేట్ మెంట్ల విషయంలో మరోసారి రికార్డులు కావాలని కోర్టుకు వెళ్లాడు. ఈ విషయాలను గుర్తు చేసిన బీటెక్ రవి.. అవినాష్ రెడ్డి ఇప్పటికే ఇరికించాల్సినదంతా ఇరికించేశారని అది తెలిసే కంగారు పడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అవినాష్ రెడ్డి తన స్టేట్ మెంట్ల విషయంలో పడుతున్న కంగారు చూస్తే ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది. సీబీఐ అధికారులు మాత్రమే కాదు ఏ దర్యాప్తు సంస్థ అయినా విచారణను రికార్డు చేస్తుంది. ఎదురుగా కెమెరామెన్ ను పెట్టకపోయినా రూమ్ లో చుట్టూ కెమెరాలను ముందే అమర్చిఅయినా రికార్డు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం ఉండదు. అయినా చేయలేదని అవినాష్ రెడ్డి కోర్టుకు వెళ్లాడు.
సీబీఐ అధికారులకు నిందితుల్ని పట్టుకోవడం… సూత్రధారుల్ని బయటకు లాగడంలో ప్రత్యేమైన అనుభవం ఉంటుంది. కానీ అధికారం ముసుగులో తప్పించుకుంటూ వారిని ఇప్పటి వరకూ ఎదుర్కోని అవినాష్ రెడ్డికి… ప్రశ్నలకు ఎలా జవాబులు చెప్పాలో పెద్దగా అనుభవం లేదు. అక్కడే తేడా కొట్టిందని.. అవినాష్ రెడ్డి నుంచి కొన్ని క్లూలు బయటకు లాగి ఇతర విషయాల్లో ఉన్న డౌట్స్ ను క్లియర్ చేసుకుంటున్నారని అంటున్నారు.
ఈ విషయంపై స్పష్టత రావడంతోనే అవినాష్ రెడ్డిని కాపాడేందుకు చేయాల్సినదంతా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లు… విచారణలో చెప్పిన విషయాలు వెలుగులోకి వస్తే సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.