వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసు ముందు తన దర్యాప్తు నివేదికను .. వెల్లడించారు. పూర్తిగా ముందుగానే బట్టీ పట్టినట్లుగా చెప్పిన ఆయన కథనాన్ని… .. వైసీపీ మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రెండో పెళ్లి వల్లే హత్య జరిగిందని.. దాన్ని కూతురు, అల్లుడే చేశారని తేల్చి ప్రచారం ప్రారంభించారు. చూసేవాళ్లు .. పాపం మొదట తండ్రిని చంపేశారు.. ఇప్పుడు పిల్లలపై నిందలేస్తున్నారు.. ఇదేమీ చోద్యం అనుకునే పరిస్థితి. !
కొత్త కథలను తెరపైకి తెచ్చిన ” జే క్యాంప్ “
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అడ్డంగా ఇరుక్కుపోయి ఎలా బయటకు రావాలో తెలియక కొత్త కొత్త కథలు అల్లేందుకు తికమక పడుతున్న వైసీపీ పెద్దలు .. కొత్త కథలు వండేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి షేక్ షమీమ్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. వారికో బిడ్డ ఉన్నాడు. వివేకా అసలు పేరును అక్బర్ గా కూడా మార్చేశారు అవినాష్ రెడ్డి. ఆ బిడ్డను రాజకీయ వారసుడిగా వివేకానందరెడ్డి ఉరఫ్ అక్బర్ ప్రకటించాలనుకున్నారు. ఆస్తులు కూడా రాసివ్వాలనుకున్నారు. ఇది అల్లుడు, కూతురుకు నచ్చలేదు. అందుకే చంపించేశారు.. అని అవినాష్ రెడ్డి దర్యాప్తులో తేలినట్లుగా కళ్లకు కట్టినట్లుగా వివరించారు. మరి వాళ్లెవరో చంపించేస్తే.. అవినాష్ రెడ్డి ఎందుకు సాక్ష్యాలు తుడిచేశాడు.. సీఐ శంకరయ్యను కేసు వద్దని ఎందుకు హెచ్చరించారు…?
గుండెపోటు కథ చెప్పింది అవినాష్ కాదట !
వివేకాను అంత దారుణంగా హత్య చేస్తే.. గుండెపోటుతో చనిపోయారని ఆస్పత్రికి తీసుకెళ్లే వరకూ ఎందుకు చెప్పలేదని ప్రధానంగా వస్తున్న సందేహం. దీనికి అవినాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని తాను ఎవరికీ చెప్పలేదనేశారు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే గుండెపోటు అంశాన్ని సృష్టించిందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ మాటలు వింటే.. అవినాష్ రెడ్డికి అప్పట్లో మీడియా ఉందని.. ఆయన మాటలు రికార్డు చేసిందని.. ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయని తెలియదేమో అనే డౌట్ ఎవరికైనా రావొచ్చు. కానీ ఇంత తెగించిన వారు అవన్నీ ఫేక్ వీడియోలని చెప్పరేని గ్యారంటీ ఏమీలేదు.
కేసును సునీతపై తోసేసే లక్ష్యం !
కేసును వివేకా కుమార్తె, అల్లుడిపై తోసేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. కొన్నాళ్లుగా చేస్తున్న వాదనను ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నారు. మొత్తంగా అవినాష్ రెడ్డి బరి తెగించేశారని అర్థమైపోతుంది. అప్పుడు ఏం జరిగిందో ప్రజల కళ్ల ముందే ఉంది. దాన్ని కూడా అంతా భ్రమ అని కల్పించి.. ఈ కేసులో వైఎస్ వివేకా కుమార్తె, అల్లుడ్నే బలి చేయాలనుకుంటున్నారని స్పష్టమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి వైసీపీ .. ఆ పార్టీ అధినేత పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నారు.