సీబీఐ అధికారులు దగ్గరకు రాకుండా అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ రచించిన వ్యూహం చూస్తే ఎవరికైనా మతి పోవడం ఖాయం అనుకోవచ్చు. అరెస్ట్ కోసం అన్ని రకాల రక్షణలు కోల్పోయిన తర్వాక ఇక సీబీఐ అధికారులు ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చునని తెలిసిన తర్వాత అసలు ప్లాన్ రెడీ చేసుకున్నారు. అందు కోసం కశ్మీర్ ఉగ్రవాదులు పాటించే వ్యూహాన్ని అడాప్ట్ చేసుకున్నారు.
కశ్మీర్లో ఉగ్రవాదులు ఓ భవనంలో దాక్కున్నారు. వారి వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు ఉంటాయి. ఆ భవనం దగ్గరకు వెళ్లడానికి.. అందులో ఉన్న ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి బలగాలు చాలా రిస్క్ తీసుకుంటాయి. ఓ భవనంలో ఉగ్రవాదులు ఎలా దాక్కుంటారు ? అక్కడే అసలు విషయం ఉంది. ఇక ఏ దారి లేనప్పుడు ఇలా ఓ భవనాన్ని అడ్డాగా చేసుకుని అందులో దాక్కుంటే..అక్కడకు రావడానికి ఎవరైనా భయపడాల్సిందే. చాన్స్ దొరికితే.. అందులో ఉన్న వారిని హోస్టేజీలుగా తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తారు.
కర్నూలులో గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న పరిమామాలు చూస్తే.. ఎవరికైనా కశ్మీర్ ఉగ్రవాదుల ఓ భవనంలో దాక్కున్న ఘటనలే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడా అదే వ్యూహం అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ అమలు చేసింది. సీబీఐ అరెస్ట్ చేస్తుందని క్లారిటీ వచ్చాక తల్లికి బాగోలేదని ఆయన హైదరాబాద్ నుంచి వెనుదిరిగారు. తల్లికి పులివెందులలో కాకుండా హైదరాబాద్ లేదా బెంగళూరులో చికత్స అందిస్తామని ప్రచారం చేశారు. కానీ ముందస్తు వ్యూహం ప్రకారం కర్నూలు తీసుకెళ్లి అయిన వాళ్ల ఆస్పత్రిలో చేర్చారు. చుట్టూ సొంత సైన్యాన్ని కాపలా పెట్టుకున్నారు.
పోలీసులు ఎలాగూ నిర్వీర్యం అయిపోయారు. సీబీఐకి సహకరించేందుకు కూడా అధికారులు ఆసక్తి చూపలేదు. శాంతి భద్రతలను కాపాడతామనే గ్యారంటీ ఇవ్వలేదు. ఇక ఆస్పత్రిలో ఉన్న అవినాష్ రెడ్డి బయటకు రావడ లేదు. వచ్చినా ఆయన చుట్టూ కనీసం రెండు వందల మంది ఉండేలా చూసుకుంటున్నారు. ఈ వ్యూహం చూసిన పోలీసు అధికారుల మైండ్ కూడా బ్లాంక్ అయిపోయింది. అచ్చంగా ఉగ్రవాదుల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. విశ్వభారతి ఆస్పత్రిని షెల్టర్ గా మార్చుకుని సీబీఐతో గేమ్స్ ఆడుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలే అండగా ఉండటంతో స్థానిక పోలీసులు నిరీర్వం అయిపోయారు. కానీ తాము చేస్తున్న పనిపై ఆ డిపార్టుమెంట్లోనే ఎక్కువ మంది సిగ్గుపడుతున్నారు.
అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ వేస్తున్న ఈ ఉగ్రవాదుల వ్యూహాన్ని సీబీఐ అధికారులు ఎలా చేదిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఆపరేషన్ ఆవినాష్ రెడ్డి చేపట్టి ఏమైనా సంచలన ముగింపు ఇస్తారా లేకపోతే… పై నుంచి వచ్చే ఆదేశాల మేరకు..సైలెంట్ గా వెళ్లిపోతారా అనేది తేలాల్సి ఉంది.