వివేకా హత్య కేసులో సీబీఐ ఎక్కడ అరెస్టు చేస్తుందోనని వణికిపోతున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇస్తే మాత్రమే సీబీఐ విచారణకు వెళ్తానని మంకు పట్టు పట్టారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విచారణకు హాజరు కావాలని సీబీై నోటీసులు ఇచ్చింది. అంతుక ముందే ఆయనను ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చింది. దీంతో అరెస్టు లాంఛనమేనని అందరకీ అర్థమైపోయిది. ఓ వంద మంది అనుచరులు… ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంట రాగా.. అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి ఉదయం హైదరాబాద్కు బయలుదేరారు.
ఆయన దారిలో ఉండగానే.. లాయర్ల బృందం… హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపు లాయర్లు కోరుతున్నారు. ఆ పిటిషన్ ను సీజే బెంచ్ విచారణకు స్వీకరించింది. అయితే విచారణ జరగక ముందే అవినాష్ రెడ్డి.. తాను హైకోర్టు నిర్ణయం వెల్లడయ్యే వరకూ విచారణకు హాజరు కాబోనని ప్రకటించారు. సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారని ఆయన అంటున్నరు. కోర్టుపై తమకు నమ్మకం ఉందని, సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. న్యాయం గెలుస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.
నిజానికి అవినాష్ రెడ్డి గతంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు విచారణాధికారిని మార్చడంతో ఇక అరెస్ట్ అవసరం ఉండదనుకున్నారేమో కానీ.. ఆ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల్లో మారిపోయిన పరిణామాలతో ఆయన అత్యవసరంగా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది.