యువహీరో నాని సమర్పణలో కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన సినిమా ‘అ!’. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్, మురళీశర్మ, ప్రియదర్శి… ఇలా భారీ తారాగణంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీనికి తగ్గట్టే పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమాలో ఎవరి క్యారెక్టర్ వాళ్ళది అన్నట్టు వచ్చి వెళ్తుందా? లేదంటే వీళ్లంతా కలిసి నటించిన సన్నివేశాలు సినిమాలో ఉంటాయా? అనేది బయటకు చెప్పడం లేదు. కానీ, అందరి పాత్రలకూ కనెక్టింగ్ పాయింట్‌గా కాజల్ క్యారెక్టర్ ఉంటుంది. నిత్య, రెజీనా, ఈష సన్నివేశాలు చాలావరకూ షూటింగ్ చేసిన తర్వాత కాజల్ క్యారెక్టర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అంటే… వాళ్ళ సన్నివేశాలు చూసి కాజల్ రియాక్షన్ ఇవ్వాలట! ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే… కాజల్‌ది ఎక్కువ మేకప్ లేకుండా, పెద్దగా కుర్చీలోంచి కదలకుండా ఉండే క్యారెక్టర్. జస్ట్ ఫైవ్ డేస్‌లో షూటింగ్ కంప్లీట్ చేసేసిందీ చందమామ. సినిమాలో సందేశం వున్నా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా వినోదాత్మకంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా తీశాడని కాజల్ చెబుతోంది.