2007లో విజయవాడలో హత్యకు గురైన.. ఆయేషా మీరా కేసును.. హైకోర్టు.. సీబీఐకి ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. సీఐడీ పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని…… హైకోర్టు భావించింది. వెంటనే.. ఈ కేసును సీబీఐ తీసుకుని విచారణ జరపాలని ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… 2007లో తెనాలికి చెందిన ఆయేషా మీరా అనే విద్యార్థిని విజయవాడలోని ఓ హాస్టల్ లో దారుణహత్యకు గురైంది. ఆ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత మనవడి ప్రమేయం ఉందని.. ప్రచారం జరిగింది. కానీ చివరికి… సత్యం బాబు అనే పాత నేరస్తుడు.. ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు.
ఈ మేరకు కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. విజయవాడలోని మహిళల ప్రత్యేక న్యాయస్థానం సత్యంబాబుకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే.. గత ఏడాది మార్చి 31వ తేదీన… ఈ తీర్పును హైకోర్టు కొట్టి వేసింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని సీఐడిని ఆదేశించింది. అయితే… సీఐడీకి… కొత్తగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. విజయవాడ మహిళా న్యాయస్థానంలో ఉండాల్సిన ఫైళ్లు కూడా కనిపించ లేదు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అప్పట్లో.. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే రోజా… టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉండేవారు. ఈ కేసు విషయంపై.. న్యాయం చేయాలని.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి మనవడ్ని అరెస్ట్ చేయాలంటూ… రోజా ఓ ఉద్యమమే నడిపారు. ఆయేషా మీరా తల్లి కూడా… మంత్రి మనవడిపైనే అనుమానం వ్యక్తం చేసేవారు. ఆయేషా మీరా తల్లిని వెంట పెట్టుకుని రోజా… వైఎస్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం స్పందించడం లేదు. మరో వైపు.. ఏపీలో సీబీఐ అడుగుపెట్టడాన్ని ప్రభుత్వం… పరిమితం చేసిది. అనుమతి మేరకే విచారణ జరపాలని జనరల్ కన్సెంట్ ను రద్దు చేసిన తర్వాత తొలి సీబీఐ విచారణ ఇది. కోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి… ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఈ కేసుకు పనికి రావు. సీబీఐ విచాణ జరపడం ఖాయమే.