విజయవాడలో జరిగిన `ఆయేషా` కేసు తెలుగునాట సంచలనం సృష్టించింది. కొన్ని సినిమాల కథలకు ముడిద సరుకుగా నిలిచింది. నాని – సుధీర్బాబుల `వి` సినిమాలోనూ ఆయేషా కేసు లాంటి ప్రస్తావన ఉంటుందని, కథలో ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసు చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. `వి` ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా కనిపిస్తున్నా.. అందులో రివైంజ్ డ్రామాని దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తెలివిగా జోడించాడని సమాచారం. తన జీవితంలో జరిగిన ఓ దారుణమైన ఘటనకు నాని ఎలా, ఏ విధంగా ప్రతికారం తీర్చుకున్నాడన్నది `వి` కథ. నాని మిలటరీ అధికారిగా నటించాడు. ఓ మిలటరీ అధికారికి ఎవరిపై, ఎందుకు ప్రతికారం తీర్చుకోవాల్సివచ్చిందన్నది `వి` కాన్సెప్ట్. సుధీర్ బాబు పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. అతిధిరావు హైదరీ, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. కథలో వీరిద్దరి పాత్ర చాలా కీలకమని సమాచారం. సెప్టెంబరు 5న ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు.