వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి తాను పార్టీ మారడం లేదని చెప్పారు కానీ..ఆయన చెప్పిన విధానంలో మాత్రం చాలా తేడా కనిపిస్తోంది. మాములుగా అయితే వైసీపీ భాషలో చెలరేగిపోయి… ఇ తర పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బూతులందుకోవాలి. జగన్ రెడ్డిని ఒక్క మగాడని పొగడాలి. కానీ ఆయన మాత్రం ఏదో తల దించుకుని ప్రభుత్వాలు మారినప్పుడు ఒత్తిళ్లు ఉంటాయని తాను మాత్రం పార్టీ మారనని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన విధానంలో మాత్రం నమ్మకం కాన్ఫిడెన్స్ ఎవరికీ కనిపించలేదు.
ఎమ్మెల్సీలపై చాలా ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు. ఆ ఎమ్మెల్సీలు ఎవరో కాన అయోధ్య రామిరెడ్డి మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. జగన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయ జీవితమే కాదు.. రాంకీ వ్యాపార సంస్థ కూడా కదిలిపోతుందని ఆయన ఆందోళన చెందుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఐదేళ్ల కాలంలో ఆయనేమీ చిన్న చిన్న పనులు చేయలేదు. క్విడ్ ప్రో కోతో పార్టీ ఆఫీసులన్నీ ఆయనే కట్టించారని చెబుతున్నారు. అంటే అంతకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ ప్రయోజనాలు పొందారు. వాటిని రేపోమాపో బయటకు తీస్తే మొదటికే మోసం వస్తుంది.
బీజేపీలో చేరడానికి అయోధ్య రామిరెడ్డి సిద్దపడలేదని .. టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ నాయకత్వం అంగీకరించలేదని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన రాజీనామా వాయిదా పడిందని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే చెప్పుకొచ్చారు. అది నిజం కాకపోతే.. ఆర్కేను తప్పు పట్టాల్సింది అలాంటి పని మాత్రం చేయలేదంటే.. ఏదో తేడా ఉందని వైసీపీ నేతలకూ అర్థమవుతోంది.