సభకు వెళ్లక పోతే మీపై అనర్హతా వేటు వేస్తారంటున్నారని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్టు జగన్ ను ప్రశ్నించారు. వారికి బుద్ది పుట్టింది చేసుకోని అని జగన్ తేలికగా తీసుకున్నారు. ఇప్పుడు అదే చేయడానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీగా ఉన్నారు. తాజాగా ఇద్దరూ కలిసి ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ లీవ్ లెటర్ ఇవ్వలేదని.. కంటిన్యూగా 60 రోజులు అనుమతి తీసుకోకుండా గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోతారని స్పష్టం చేశారు. ,నిబంధన ఉంది దాన్ని అమలు చేయటం సభ బాధ్యత అన్నారు. 60 రోజులు రాకపోతే సభలో పెట్టాలి ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ జగన్ పై అనర్హతా వేటుకు సిద్ధంగా ఉన్నారని వారి మాటల్ని బట్టి అర్థమైపోతుంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవు. కనీసం లీవ్ లెటర్ కూడా పంపరు. తాను ఫలానా కారణంతో రావడం లేదని స్పీకర్ కు లెటర్ పంపితే అప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ.. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి లేఖలు పంపలేదు. స్పీకర్ అనర్హతా వేటు వేస్తే ఒక్క జగన్ పై కాదు.. అందరు ఎమ్మెల్యేలపై వేయాల్సి వస్తుంది. లేదంటే.. కొంత మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుకుని అసెంబ్లీకి వచ్చేలా చేసి.. జగన్ ఒక్కరిపై వేటు వేసే ఆప్షన్ కూడా ఉంటుంది.
పులివెందులలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ గెలవడం అసాధ్యం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఓ వైపు కుటుంబం చీలిపోయింది. అత్యంత దగ్గర అయిన వారు దూరమయ్యారు. కేసుల భయంతో అవినాష్ రెడ్డి కూడా యాక్టివ్ గా లేరు. షర్మిల చాలా ఫైర్ మీద ఉన్నారు. అదే సమయంలో బీటెక్ రవి .. నియోజకవర్గాన్ని కమ్మేస్తున్నారు. నీటి సంఘాల ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకున్నారు. అందుకే ఉపఎన్నిక అంటూ వస్తే.. ఈ సారి జగన్ కు గడ్డు పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరి జగన్ ఏం చేస్తారో ?