విశాఖ జిల్లా టీడీపీలో గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడి మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నా సరిపడలేదు. ఇప్పుడు మాత్రం కుదురుతుందా..?. టీడీపీ ఓడిపోయాక.. కనిపించని గంటా..ఇటీవలే మళ్లీ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనారోగ్యం, కోవిడ్ వల్ల యాక్టివ్ గా లేనని ఇక ముందు చురుగ్గా ఉంటానని బుధవారమే చెప్పారు. గురువారం అయ్యన్న ఆయనపై పైర ్అయ్యారు.
గంటా శ్రీనివాసరావుపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సీరియస్ కామెంట్స్ చేసారు. ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు..! లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? ప్రధానా..? అంటూ ప్రశ్నించారు. పార్టీలో అందరూ రావాలి.. పని చేయాలన్నారు.. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక అని స్పష్టం చేశారు.. మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని సెటైర్ వేశారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే మేం కోరుకుంటున్నామన్న ఆయన.. అలా అండగా ఉండని వారిని చూస్తేనే మాకు బాధేస్తుందన్నారు.. మాకు అందరూ కావాలి. పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటామన్నారు.
గంటా శ్రీనివాసరావుపై అయ్యన్న చాలా కాలంగా సీరియస్ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల టీడీపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొంత మంది నేతలు పార్టీలో చేరలేకపోతున్నారు. సీనియర్ నేత కొణతాల రామకృష్ణ టీడీపీ వైపు చూస్తున్నా.. గంటా కారణంగా ఆగిపోయారన్న ప్రచారం ఉంది. కొణతాలకు అయ్యన్న సపోర్ట్ ఉంది. ఈ ఈ క్రమంలో అయ్యన్న వర్సెస్ గంటా పంచాయతీని .. టీడీపీ హైకమాండ్ ఎలా తీరుస్తుందో చూడాల్సి ఉంది.